- Telugu News Photo Gallery Cricket photos Ipl 2023 why rcb bowler harshal patel over banned against Chennai Super Kings
IPL 2023: చివర్లో ఇదేం బౌలింగ్ సామీ.. ఓవర్ పూర్తి కాకుండానే షాక్.. ఎందుకంటే?
Royal Challengers Bangalore vs Chennai Super Kings, IPL 2023: మిడిల్ ఆర్డర్‌లో శివమ్ దూబే 27 బంతుల్లో 5 భారీ సిక్సర్లు, 2 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. చివరి దశలో మొయిన్ అలీ, రవీంద్ర జడేజా కీలక సహకారం అందించారు.
Updated on: Apr 18, 2023 | 7:12 PM

IPL 2023 RCB vs CSK: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

అందుకు తగ్గట్టుగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన సీఎస్‌కే జట్టుకు డెవాన్ కాన్వే అద్భుత ఆరంభాన్ని అందించాడు. ఆరంభం నుంచే ఆర్సీబీ బౌలర్లను ఉతికారేశాడు. 45 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు.

మిడిలార్డర్‌లో శివమ్ దూబే 27 బంతుల్లో 5 భారీ సిక్సర్లు, 2 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. చివరి దశలో మొయిన్ అలీ, రవీంద్ర జడేజా కీలక సహకారం అందించారు.

ముఖ్యంగా ఆఖరి ఓవర్ వేసిన హర్షల్ పటేల్ అదనపు పరుగులు ఇవ్వడంతో ఖరీదుగా మారాడు. 20వ ఓవర్‌లో తొలి బంతికి హర్షల్ పటేల్ 1 పరుగు ఇచ్చి, ఆ తర్వాత నో బాల్‌గా వెశాడు.

ఆ తర్వాత ఫ్రీ హిట్‌లో 1 పరుగు ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ వైడ్ బాల వేశాడు. ఆ తర్వాత మరో నోబాల్. వెంటనే హర్షల్ పటేల్ బౌలింగ్‌ను అంపైర్ నిలిపేశాడు.

అందుకు కారణం హర్షల్ విసిరిన రెండు బీమర్ నోబాల్స్. అంటే హర్షల్ పటేల్ నడుము పైకి నేరుగా బౌలింగ్ చేసి తప్పు చేశాడు. మొదటి బీమర్ విసిరినప్పుడు అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే బీమర్ రెండోసారి కూడా అదే బౌలింగ్ చేయడంతో అంపైర్ అతని బౌలింగ్‌పై నిషేధం విధించాడు.

ఐసీసీ నిబంధనల ప్రకారం, బ్యాట్స్‌మెన్‌ల భద్రత కోసం నడుము లేదా ఛాతీ ప్రాంతంలో ప్రమాదకరమైన డెలివరీలను నో బాల్స్‌గా పరిగణిస్తారు. మొదటి డెలివరీకి అంపైర్ బీమర్‌ను హెచ్చరించాడు. అదే తప్పు పునరావృతమైతే అతని బౌలింగ్‌కు ఆటంకం కలుగుతుంది.

అదే కారణంతో 20వ ఓవర్లో 3 బాల్స్ వేసిన తర్వాత హర్షల్ పటేల్ బౌలింగ్ నిషేధించారు. ఆ తర్వాత గ్లెన్ మాక్స్‌వెల్ మిగిలిన 3 బంతులు విసిరి 20వ ఓవర్ పూర్తి చేశాడు.





























