Prank gone Wrong: ఒకే ఒక్క ‘కిక్’.. అమ్మాయి రాక్స్.. కుర్రాడు షాక్.. పగిలిపొయిందంతే..
Viral Video: స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇతర సన్నిహితులతో చిలిపి ఆటలు ఆడటం సరదాగా ఉంటుంది. ఇది మన మానసిక స్థితిని ప్రకాశవంతం చేయడమే కాకుండా మన బంధాలను కూడా పెంచుతుంది.

స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇతర సన్నిహితులతో చిలిపి ఆటలు ఆడటం సరదాగా ఉంటుంది. ఇది మన మానసిక స్థితిని ప్రకాశవంతం చేయడమే కాకుండా మన బంధాలను కూడా పెంచుతుంది. అయితే అన్ని సందర్భాలలో ఇది వర్కౌట్ కాకపోవచ్చు. అందుకే.. చేసే అల్లరి పని అయినా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది.
ఈ మధ్య కాలంలో ప్రాంక్‌ల పేరుతో తమ ఫ్రెండ్స్, సన్నిహితులను ఆట పట్టించడం పరిపాటిగా మారింది. ఈ విధంగానే ఓ యువకుడు కూడా తన స్నేహితురాలిని ఆటపట్టించబోయాడు. షాపింగ్ మాల్‌లో ప్రాంక్ చేశాడు. అయితే, ఆ ప్రాంక్ ఫెయిల్ అయ్యి.. తగలరాని చోట తగిలిగింది. దాంతో వామ్మో వాయ్యో అనాల్సిన పరిస్థితి అతనికొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.




వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి తన స్నేహితురాలిని ప్రాంక్ చేసేందుకు గానూ.. హుడీని రివర్స్ వేసుకుని నిల్చున్నాడు. ఇంతలో అతన్ని సమీపించిన అమ్మాయి.. అతను అటువైపు తిరిగి ఉన్నాడనుకుంది. చేత్తో ఒకే ఒక్క షాట్.. ఆ అబ్బాయి ప్రైవేట్ పార్ట్‌పై కొట్టింది. వాస్తవానికి అది అతని బ్యాక్ అనుకుని ఆ అమ్మాయి కొట్టింది. కానీ, సీన్ రివర్స్ అవడంతో.. అతని బాక్స్ బద్దలైంది. లబోదిబోమంటూ ఆ అబ్బాయి బయటకు వెళ్లాడు.
ఈ ఫన్నీ ప్రాంక్ వీడియో చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. దూల తీరిందా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రాంక్ చేసే ముందు చాలా జాగ్రత్తగా చేయాలని సూచిస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. ప్రాంక్ వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
