వంటగదిలో ఎక్కువగా వాడే పదార్థాల్లో అల్లం కూడా ఒకటి. దాదాపు అన్ని రకాల వంటకాల్లో అల్లం వాడుతుంటాం. అల్లంలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి
TV9 Telugu
ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణక్రియకు మద్దతు ఇవ్వడంలో, నోటి ఆరోగ్యాన్ని కాపాడడంలో, స్త్రీలల్లో వచ్చే నెలసరి సమస్యలను అల్లం మేలు చేస్తుంది
TV9 Telugu
అయితే అల్లం ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికీ దీనిని వాడే విషయంలో తప్పులు చేయడం వల్ల అల్లంతో లభించే ప్రయోజనాలను మనం పొందలేం
TV9 Telugu
అల్లాన్ని ముదురు రంగు వచ్చే వరకు వేయించడం వల్ల దానిలో ఉండే సహజ సమ్మేళనాలు పోతాయి. దాని రుచి, ఆరోగ్య ప్రయోజనాలు కూడా తగ్గుతాయి. అల్లాన్ని కొద్దిగా వేయించడం లేదా వంట చివర్లో వేయడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది
అలాగే ఒకే సమయంలో ఎక్కువ అల్లాన్ని వాడడం వల్ల కూడా మనం తగిన ప్రయోజనాలను పొందలేం. అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆమ్లత్వం, కడుపులో అసౌకర్యం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి
TV9 Telugu
తక్కువ మోతాదులో అల్లాన్ని తీసుకున్నప్పుడే జీర్ణక్రియకు మేలు కలుగుతుంది. అల్లాన్ని సరిగ్గా నిల్వ చేయడం వల్ల ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటుంది.
TV9 Telugu
అలాగే అల్లంపై ఉండే తొక్కను తొలగించిన తరువాతే వాడుతూ ఉంటాం. కానీ వీలైనంత వరకు అల్లాన్ని తొక్కతో సహా ఉపయోగించాలి. అల్లం తొక్కలో రుచి, వాసనతో పాటు ప్రయోజనకరమైన సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి