TG Vishwa Prasad: పాపం విశ్వ ప్రసాద్ !! ’15 సినిమాలు తీస్తే.. రెండే హిట్టు
రాజాసాబ్ ఫలితం తర్వాత TG విశ్వ ప్రసాద్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు. సాఫ్ట్‌వేర్ కంపెనీతో పాటు సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టిన విశ్వ ప్రసాద్, మూడేళ్లలో 15 సినిమాలు నిర్మించారు. గూఢచారి, కార్తికేయ 2, ధమాకా, మిరాయ్ వంటి విజయాలు సాధించినా, రాజాసాబ్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు నిరాశపరిచాయి. ఇప్పుడు రాజాసాబ్ ఓటీటీ విడుదల కావడంతో, ఆయన ప్రస్థానంపై చర్చ సాగుతోంది.
రాజాసాబ్ రిజెల్ట్ కారణంగా.. TG విశ్వ ప్రసాద్ నేమ్ కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీని నడిపించే విశ్వప్రసాద్.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పేరుతో టాలీవుడ్‌లో ప్రొడ్యూస్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మూడేళ్లలో దాదాపు 15 వరకు సినిమాలను ప్రొడ్యూస్ చేశాడు. అయితే వీటిలో రెండు మూడు తప్పితే.. అన్ని సినిమాలు కూడా నెగెటివిటీని ఎదుర్కొన్నవే. తంలో గూఢచారి, కార్తికేయ 2 సినిమాలతో హిట్స్ అందుకున్న ఈ సంస్థ.. 2022 డిసెంబరులో ‘ధమాకా’తో బ్లాక్‌బస్టర్ కొట్టింది. ఇక గతేడాదీ 2025లో ఈ నిర్మాణ సంస్థ నుంచి.. తెలుసు కదా, మనమే, మిరాయ్, మోగ్లీ మూవీస్ వచ్చాయి. వీటిలో తేజ సజ్జా ‘మిరాయ్’ మాత్రమే సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ ప్రొడక్షన్ నుంచి వచ్చిన రీసెంట్ భారీ బడ్జెట్ ఫిల్మ్ రాజాసాబ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రాజాసాబ్ మూవీ అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్టు తెలుస్తోంది. మారుతీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ.. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. అయితే.. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో తడబడడంతో.. ఈ మూవీ రైట్స్ ను ఫ్యాన్సీ రేట్‌కు దక్కించుకున్న జియో హాట్ స్టార్.. ఈ మూవీని ఫిబ్రవరి రెండో వారంలో స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ది రాజాసాబ్ ఓటీటీ స్ట్రీమింగ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో అందర్లో క్యూరియాసిటీ నెలకొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: అక్కకు దిష్టి తగలకుండా చరణ్ స్పెషల్ గిఫ్ట్
Mana Shankara Vara Prasad Garu: ఆ విషయం లో చిరు సినిమాకు హైకోర్టులో నిరాశ
అలల్లా ఎగసిపడిన మంచు..షాకింగ్ వీడియో
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్‌తో వంటనూనె తయారీ!

