భారత బడ్జెట్ చరిత్రలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. తొలుత కేవలం ఇంగ్లిష్లో ముద్రితమైన కాపీలు, 1955 నుంచి హిందీలోనూ అందుబాటులోకి వచ్చాయి. బ్రిటిష్ కాలంలో సాయంత్రం 5 గంటలకు సమర్పించిన బడ్జెట్ను, 1999లో వాజ్పేయి సర్కార్ ఉదయం 11 గంటలకు మార్చింది. 2017 నుంచి ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టడం వలసవాద సంప్రదాయాలకు స్వస్తి పలికిన కీలక పరిణామం.