Ooty tour: మీరు ఊటీ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? ఈ సూపర్ ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ గురించి తెలుసా..?
IRCTC Ooty package: IRCTC ఊటీకి వెళ్లాలనుకునే పర్యాటకుల కోసం ప్రత్యేక చౌకైనా టూర్ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్ తోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఈ టూర్ ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. తక్కువ ఖర్చులో ఓ అందమైన ప్రశాంతమైన ప్రాంతానికి వెళ్లి సరదాగా గడపాలనుకుంటే ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఈ టూర్ ప్యాకేజీని తప్పక సద్వినియోగం చేసుకోండి.

మీరు సరికొత్త అందాలను చూసేందుకు ఏదైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా? అలా అయితే, తక్కువ ఖర్చులో ఒక అందమైన ఆహ్లాదకరమైన ప్రాంతానికి వెళ్లవచ్చు. అదే పర్యాటకుల స్వర్గధామం ఊటీ. IRCTC ఊటీకి వెళ్లాలనుకునే పర్యాటకుల కోసం ప్రత్యేక చౌకైనా టూర్ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్, చెన్నైతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఈ టూర్ ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. తక్కువ ఖర్చులో ఓ అందమైన ప్రశాంతమైన ప్రాంతానికి వెళ్లి సరదాగా గడపాలనుకుంటే ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఈ టూర్ ప్యాకేజీని తప్పక సద్వినియోగం చేసుకోండి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల నుంచి ఊటీకి
ఈ ప్యాకేజీ గుంటూరు జంక్షన్, నల్గొండ, తెనాలి జంక్షన్, హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. మీరు ఈ ప్రదేశాలన్నింటి నుంచి టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీ 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. ఈ ప్యాకేజీలో మీరు రైలులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సందర్శనా స్థలాల కోసం ట్యాక్సీ సౌకర్యాలు అందిస్తారు. సోలో ట్రిప్ కోసం ప్యాకేజీ ధర రూ. 27,450. ఇద్దరు వ్యక్తులు ప్రయాణించేవారికి ఒక వ్యక్తికి ప్యాకేజీ ధర రూ. 14,520. ముగ్గురు వ్యక్తులు ప్రయాణించేవారికి ఒక వ్యక్తికి ప్యాకేజీ దర రూ. 13,300 . పిల్లలకు ప్యాకేజీ ధర రూ. 7160. మీరు రైలు ఎక్కే ప్రదేశాలను బట్టి టికెట్ ధరలో మార్పులు ఉండవచ్చు.
అధికారిక IRCTC వెబ్‌సైట్ నుంచి టికెట్లను బుక్ చేసుకోవచ్చు. మీరు పిల్లలతో ట్రిప్ ప్లాను చేసుకుంటే.. ఎలాంటి ట్రావెల్ ప్లానింగ్ లేకుండా రిలాక్ట్స్ ట్రిప్ కోరుకుంటే.. ఈ ప్యాకేజీ మీకు ఉత్తమైనది. మీరు ఒంటరిగా ప్రయాణిస్తుంటే మాత్రం కొంచెం ఈ బడ్జెట్ ఎక్కువగా ఉండవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ఇద్దరు వ్యక్తులకు అనువైన బడ్జెట్ అని చెప్పవచ్చు.
