ముందుగా మేక తల మాంసాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలను తీసుకుని ముక్కలుగా చేసుకుని పెట్టండి.
స్టెప్ - 1
ఇక ఇప్పుడు మసాలా దినుసులు తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత నూనెను తీసుకుని పాన్ లో వేసి వేడి చేయండి.
స్టెప్ - 2
ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కరివేపాకు కూడా కొంచం వేసి బాగా వేయించాలి. కొద్దీ సేపటి తర్వాత దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు బాగా వేయించాలి.
స్టెప్ - 3
ఇక ఇప్పుడు దీనిలో మసాలా వేసి, మీడియం మంట మీద బాగా ఉడికించి వేయించాలి.ఆ తర్వాత మేక తల ముక్కలను వాటిలో వేసి ఐదు నిమిషాలు వేయించాలి.
స్టెప్ - 4
ఇక ఇప్పుడు దీనిలో నీరు, కొంచం పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి మరిగించాలి.మటన్ తల ముక్కలు బాగా వేగిన తర్వాత దానిలో కొత్తిమీర వేసి కిందకు దించేయండి. అంతే, వేడి వేడి మేక తల మాంసం రెడీ.