AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: కదులుతున్న రైలు దిగబోయి.. పట్టుతప్పిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే..

ఈ వీడియోని భారత రైల్వే మంత్రిత్వ శాఖ షేర్‌ చేసింది. క్యాప్షన్‌గా ఇలా రాశారు.. ప్రజలు రైళ్లలో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి మా సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు అని రైల్వేశాఖ పేర్కొన్నది. కాగా, రైలు నుంచి జారిపడ్డ మహిళను రైల్వే పోలీస్‌ వేగంగా స్పందించి బయటకు లాగిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch: కదులుతున్న రైలు దిగబోయి.. పట్టుతప్పిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే..
Railway Cop Saves Woman
Jyothi Gadda
|

Updated on: Mar 10, 2025 | 12:25 PM

Share

ఓ మహిళ కదులుతున్న రైలు నుంచి దిగే ప్రయత్నంలో పట్టుతప్పి ప్లాట్‌ఫామ్‌పై పడిపోయింది. మహిళ కింద పడిపోతుండగా, గమనించిన రైల్వే కానిస్టేబుల్‌ పరుగున వెళ్లి ఆమెను పక్కకు లాగేశాడు. దాంతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. ముంబయి లోని బోరివలి స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను భారత రైల్వే మంత్రిత్వ శాఖ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. రైల్వే పోలీసు చేసిన సాయాన్ని ‘మిషన్‌ జీవన్‌ రక్ష’గా రైల్వే శాఖ అభివర్ణించింది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్రలోని బోరివాలి స్టేషన్‌లో కదులుతున్న రైలు నుంచి దిగుతున్నప్పుడు ఒక మహిళ పట్టు కోల్పోయి రైలుకు-ప్లాట్‌ఫామ్‌కు మధ్యలోకి జారిపోయింది. అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్‌ వేగంగా స్పందించి ఆమెను పైకి లాగడంతో ప్రమాదం తప్పింది. ప్రమాదాన్ని గ్రహించి క్షణాల్లో స్పందించిన కానిస్టేబుల్‌ సమయస్పూర్తిని పలువురు ప్రశంసించారు. ఆయన చర్య అభినందనీయం అంటున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియోని భారత రైల్వే మంత్రిత్వ శాఖ షేర్‌ చేసింది. క్యాప్షన్‌గా ఇలా రాశారు.. ప్రజలు రైళ్లలో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి మా సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు అని రైల్వేశాఖ పేర్కొన్నది. కాగా, బొరివలీలో రైలు నుంచి జారిపడ్డ మహిళను రైల్వే పోలీస్‌ వేగంగా స్పందించి బయటకు లాగిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..