Viral Video: వామ్మో..ఇదేమీ జుగాడ్ తల్లో.. ఫ్యూజులు ఎగిరిపోయినై… ఎక్కడ చూస్తున్నర్రా బాబు.. ఆ బ్యాగ్‌ను చూడండి!
ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. కాస్తా డిఫరెంట్‌గా అనిపిస్తే చాలు రీల్స్ చేసి అప్‌లోడ్ చేస్తున్నారు. ఇలా ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో కొన్ని అకట్టుకునేవిధంగా ఉండి త్వరగా వైరల్ అవుతుంటాయి. ఫన్నీగా, ఆసక్తికరంగా ఉంటూ నెటిజన్స్ మనసును...

ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. కాస్తా డిఫరెంట్‌గా అనిపిస్తే చాలు రీల్స్ చేసి అప్‌లోడ్ చేస్తున్నారు. ఇలా ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో కొన్ని అకట్టుకునేవిధంగా ఉండి త్వరగా వైరల్ అవుతుంటాయి. ఫన్నీగా, ఆసక్తికరంగా ఉంటూ నెటిజన్స్ మనసును దోచేస్తాయి. ఇక జుగాడ్‌లకు సంబంధించిన వీడియోల విషయం చెప్పనక్కరలేదు. విభిన్నమైన వస్తువులు రూపొందించేవారి వీడియోలకు చూస్తుండగానే లక్షల వ్యూస్ వచ్చేస్తుంటాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక మహిళ కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కు స్కూటీపై వస్తుంది. అక్కడ కూరగాయల బండీ దగ్గర కూరగాయలను కొనుగోలు చేస్తోంది. కూరగాయల వ్యాపారి కూరగాయలను తూకం వేసి వాటిని ఆమె తెచ్చుకున్న హ్యాండ్ బ్యాగ్‌లో పోస్తాడు. అయితే ఇక్కడే అసలు మసాలా. ఆమె తెచ్చుకున్న బ్యాగ్ చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఎందుకంటే ఆ బ్యాగ్‌ను అండర్‌వేర్‌తో తయారు చేశారు. పాత అండర్‌వేర్‌కు కింద కుట్టేసి దానికో పట్టి కూడా తగిలించి హ్యాండ్ బ్యాగ్‌లా మార్చేసింది.
వీడియో చూడండి:
View this post on Instagram
ఇలాంటి బ్యాగ్‌ను ఇప్పటి వరకు ఎక్కడా చూసి ఉండరు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటి వరకు వేల మంది ఆ వీడియోను వీక్షించారు. ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అయితే కేవలం వీడియో కోసమే ఇలాంటి బ్యాగ్‌ను రూపొందించి ఉంటారని నెటిజన్స్ అనుమానం వ్యకత్ం చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఎంత పేదవారు అయినా ఇలాంటి హ్యాండ్ బ్యాగ్ వాడరని పోస్టులు పెడుతున్నారు.
