Viral Video: తగ్గేదేలే.. ఎక్కడైనా మేకప్ చేసుకోవచ్చు.. మెట్రో రైల్‌లో హ్యాపీగా మేకప్ చేసుకుంటున్న యువతులు..

కొంతమంది పాటలు పాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కొన్ని సార్లు ప్రయాణీకులు ఆటపాటలను మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులు కూడా చాలా ఆనందిస్తారు. అయితే ఢిల్లీ మెట్రో రైలు లోపల ఎవరైనా మేకప్ చేసుకోవడం మీరు ఎప్పుడైనా చూశారా? అవును, అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది, ఇందులో ఇద్దరు అమ్మాయిలు మెట్రో బోగీలోపల కూర్చున్నారు. అక్కడ ఏదో బ్యూటీ పార్లర్‌లో కూర్చున్నట్లు గా కూర్చుని మేకప్ చేసుకుంటున్నారు.

Viral Video: తగ్గేదేలే.. ఎక్కడైనా మేకప్ చేసుకోవచ్చు.. మెట్రో రైల్‌లో హ్యాపీగా మేకప్ చేసుకుంటున్న యువతులు..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jul 17, 2024 | 12:23 PM

ఢిల్లీ మెట్రో తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు రద్దీ కారణంగా , కొన్నిసార్లు మెట్రో లోపల తగాదాలు .. ఒకరిపై ఒకరు దాడి కారణంగా.. మెట్రో లోపల అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ఇలా రకరకాల సంఘటనలు వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అంతేకాదు కొంతమంది పాటలు పాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కొన్ని సార్లు ప్రయాణీకులు ఆటపాటలను మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులు కూడా చాలా ఆనందిస్తారు. అయితే ఢిల్లీ మెట్రో రైలు లోపల ఎవరైనా మేకప్ చేసుకోవడం మీరు ఎప్పుడైనా చూశారా? అవును, అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది, ఇందులో ఇద్దరు అమ్మాయిలు మెట్రో బోగీలోపల కూర్చున్నారు. అక్కడ ఏదో బ్యూటీ పార్లర్‌లో కూర్చున్నట్లు గా కూర్చుని మేకప్ చేసుకుంటున్నారు.

వైరల్ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు మెట్రో బోగీలోపల కూర్చున్నారు. ఆ బోగీ చాలా ఖాళీగా కనిపిస్తోంది. ఆ ఇద్దరు యువతుల పక్కన ఏ ప్రయాణీకుడు లేడు. అటువంటి పరిస్థితిలో ఆ ఇద్దరు యువతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మేకప్ చేసుకోవడం ప్రారంభించారు. అమ్మాయిలిద్దరూ ముఖానికి క్రీమ్ రాసుకోవడం.. మేకప్ వేసుకోవడం కోసం కూర్చున్న విధానం కూడా అద్భుతంగా ఉంది. ఒక అమ్మాయి కాళ్లను ముడిచి ఇంట్లో కూర్చున్నట్లు కూర్చోగా, మరో అమ్మాయి మాత్రం కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. వేరిద్దరూ ఢిల్లీకి చెందిన బాలికలేనని చెబుతున్నారు. మెట్రో లోపల ఇలాంటి దృశ్యాన్ని చూడడం చాలా అరుదు అని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో delhi.connection అనే ఐడితో షేర్ చేశారు. ఇది ఇప్పటివరకు 38 వేల వ్యూస్ ను సొంతం చేసుకోగా, వందలాది మంది వీడియోను లైక్ చేసారు. వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్లు తమ అభిప్రాయాలను వివిధ రకాలుగా తెలియజేస్తున్నారు. మరికొందరు ఢిల్లీ మెట్రోలో తమ అనుభవాల గురించి చెప్పారు. ఒకరు ఫన్నీగా కామెంట్ చేస్తూ వీళ్ళు ఇంట్లో సాంప్రదాయ అమ్మాయిలుగా నటిస్తూ.. బయటకు వచ్చిన తర్వాత వీళ్ల నిజ రూపాన్ని చూపిస్తారు అని వ్యాఖ్యానించారు. మరొకరు వీరికి టికెట్ తో పాటు ఉచిత మేకప్ కిట్‌ ని ఇవ్వండని వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..