Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అలా సంధ్యాసమయంలో.. పురి విప్పిన నెమలి నాట్యం.. ఎద్దులతో కలిసి ఇలా అందంగా..

వైరల్ అయిన వీడియో క్యాప్షన్‌లో ఇలా రాశాడు..ఇంత అందమైన దృశ్యాన్ని చూసి అందరూ మైమరిచిపోయారని కామెంట్ సెక్షన్‌లో చెబుతున్నారు. మరొకరు స్పందిస్తూ.. నెమళ్లు, గోవులు ఒకే చోట ఉన్నాయంటే.. సమీపంలో ఎక్కడో కన్హాయ్య కూడా ఉండే ఉంటాడని, ఆ చిన్ని కృష్ణుడు వేణు వాయిస్తూ ఉండాలి అని వ్యాఖ్యానించారు. ఈ అందమైన రీల్‌కి ఇప్పటివరకు 1 కోటి 14 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోకు 21 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.

Watch: అలా సంధ్యాసమయంలో.. పురి విప్పిన నెమలి నాట్యం.. ఎద్దులతో కలిసి ఇలా అందంగా..
Cow And Peacock Playing
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 17, 2024 | 7:17 PM

సోషల్ మీడియా రీల్స్‌లో స్క్రోల్ చేస్తున్నప్పుడు, కొన్నివీడియోలు హృదయాన్ని హత్తుకునేలా కనిపిస్తుంటాయి. అలాంటి రీల్ ఒకటి సోషల్ మీడియా సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఇది ఆవు, నెమలి మధ్య అందమైన స్నేహాన్ని చూపుతుంది. ఆ క్షణం ఎంతో అందంగా, నెటిజన్లను ఆకట్టుకునేలా కనిపించింది. ఇంటర్నెట్ వేదికగా ప్రజలు ఈ వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆవు, నెమలి మధ్య మైత్రిని చూసిన చాలా మంది నెటిజన్లు దీనిపై స్పందించారు. వివరాల్లోకి వెళితే..

నెమలి అంటే అందరికీ చాలా ఇష్టమైన పక్షి. నెమలి మన జాతీయ పక్షి.. సోషల్ మీడియలో నెమలి వీడియోలను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఈసారి నెమలి చేసిన ఓ అద్భుతమైన సంఘటన నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. అందమైన నెమలి పురివిప్పి ఎద్దుల ముందు నాట్యం చేస్తుండగా, స్థానికులు కొందరు వీడియో తీశారు.. తర్వాత ఏం జరిగిందో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. కొన్నిసార్లు ప్రకృతి మనకు ఇలాంటి మంచి అనుభూతిని కలిగించే దృశ్యాలను కూడా చూపుతుందని చాలా మంది వీడియోపై స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పల్లెల్లోని పొలం గట్లపై మేస్తున్న ఎద్దులను చూసినా, సాయంత్రం వేళల్లో నెమలి అరుపు విన్నా ఈ అందమైన క్షణాలు నగర వాహనాల రణగొణధ్వనుల కంటే ఎంతో ప్రశాంతంగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటీ వీడియోలు చూడటం ద్వారా జీవితంలోని ఒత్తిడినంత ఒక్కసారిగా జయించి మనశ్శాంతిని పొందుతారు. ఎద్దుల ముందు నెమలి నాట్యం చూస్తుంటే.. వాటి మధ్య స్నేహపూర్వక బంధం ఉందని అనిపిస్తుంది. ఇలాంటి దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. వైరల్ వీడియోను మీరూ చూసేయండి..

View this post on Instagram

A post shared by Cowsblike (@cowsblike)

వైరల్ అయిన వీడియోలో రెండు ఎద్దులు, నెమలి ఒకదానితో ఒకటి పోటి పడు ఆడుకుంటున్నట్టుగా ఉన్నాయి. ఎద్దు ముందు నెమలి నాట్యం చేస్తోంది. దాన్ని ఆటపట్టించడానికి, ఆ ఎద్దు నెమలిని వెంబడించడం కూడా కనిపిస్తుంది. ఇంతలో నెమలి కాస్త తోక ముడుచుకుని ముందుకు పరుగెత్తింది. ఎద్దు, నెమలి జత నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోను @cowsblike అనే ఖాతాదరు Instagramలో షేర్‌ చేశారు.

వైరల్ అయిన వీడియో క్యాప్షన్‌లో ఇలా రాశాడు..ఇంత అందమైన దృశ్యాన్ని చూసి అందరూ మైమరిచిపోయారని కామెంట్ సెక్షన్‌లో చెబుతున్నారు. మరొకరు స్పందిస్తూ.. నెమళ్లు, గోవులు ఒకే చోట ఉన్నాయంటే.. సమీపంలో ఎక్కడో కన్హాయ్య కూడా ఉండే ఉంటాడని, ఆ చిన్ని కృష్ణుడు వేణు వాయిస్తూ ఉండాలి అని వ్యాఖ్యానించారు. ఈ అందమైన రీల్‌కి ఇప్పటివరకు 1 కోటి 14 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోకు 21 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..