AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఎందుకైనా మంచిది.. షూలు వేసుకునే ముందు ఓసారి చెక్‌ చేసుకోండి..! ఇలా కూడా జరగొచ్చు..

కానీ,యాదృచ్ఛికంగా వర్షాకాలంలో ఇలాంటి సంఘటనలు ఎవరికైనా జరగవచ్చు. కాబట్టి, బూట్లు ధరించే ముందు, మీరు వాటిని జాగ్రత్తగా చెక్‌ చేసుకోవాలంటున్నారు. కొన్ని రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటనే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అక్కడ లెదర్ షూ లోపల చిన్న పాము కనిపించింది. ఆర్తి అనే మహిళ ఈ వీడియోను పోస్ట్ చేసింది. అలాగే చిన్న కర్రతో పామును బయటకు తీయడానికి ప్రయత్నించాడు. కానీ కర్ర మోపడంతో మరింత లోపలికి వెళ్లింది.. దీంతో ఆ మహిళ తన చేతులతో పామును బయటకు తీసుకొచ్చింది.

Viral Video: ఎందుకైనా మంచిది.. షూలు వేసుకునే ముందు ఓసారి చెక్‌ చేసుకోండి..! ఇలా కూడా జరగొచ్చు..
Cobra
Jyothi Gadda
|

Updated on: Jul 17, 2024 | 8:00 PM

Share

వర్షాకాలంలో పాముల బెడద పెరుగుతుంది. ఈ సమయంలో పాములు, కప్పలు తరచూ ఇళ్ల చుట్టుపక్కల కనిపిస్తూ ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తుంటాయి. వర్షాలు, వరదల కారణంగా పాములు తరచూ ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయి. అందుకే వర్షాకాలంలో షూస్, బట్టలను మళ్లీ మళ్లీ చెక్ చేసుకోవాలని తరచూ వింటుంటాం.. వర్షాకాలంలో పాములు తరచుగా ఇళ్ల మూలల్లో, బాత్రూమ్ కాలువలు, బూట్ల లోపల నక్కి కనిపిస్తుంటాయి.. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక్కడ షూ లోపల ముడుచుకుని విషపూరితమైన నాగుపాము నక్కి ఉంది.. అది ఒక్కసారిగా బుసలు కొడుతూ పడగవిప్పి పైకి లేచిన వీడియో భయానకంగా ఉంది. ఏమాత్రం అజాగ్రత్తగా బూట్లలో పాదాలు పెట్టి ఉంటే..పెద్ద ప్రమాదమే ఎదురయ్యేది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

నీరజ్ ప్రజాపత్ అనే స్నేక్‌క్యాచర్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. వీడియోలో, అతను షూ లోపల నుండి నాగుపామును బయటకు తీస్తున్నాడు. షూ రాక్‌లో వరుసగా షూలు పేర్చి ఉండగా,వాటిలోని ఒక షూలోపల భారీ నాగుపాము నక్కిఉంది. అది గమనించిన ఆ ఇంటి యాజమాని స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించగా, అతను పాము పట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అతడు షులో కర్రను చొప్పించిన వెంటనే ఆ పాము కోపంతో పడగ విప్పి పైకి లేచింది. ఈ వీడియో చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. వీడియోలో విష సర్పం చాలా భయానకంగా పడగవిప్పి బుసలు కొడుతుంది. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ క్యాప్షన్‌లో ఇలా రాశారు.. వర్షాకాలంలో మీ బూట్లను ఎప్పుడూ చెక్ చేసుకోండి. అని సూచించారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే వైరల్ గా మారింది. ఈ వీడియోకు దాదాపు మిలియన్ వ్యూస్‌ రాగా, లైక్‌లు దాదాపు 6 లక్షల వరకు ఉన్నాయి. మరోవైపు ఆ పోస్ట్‌పై రకరకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యక్తి ఇక నుంచి కచ్చితంగా చెప్పులే వేసుకుంటాడని ఒకరు రాయగా, అది ఫేక్ వీడియో అంటూ మరొకరు రాశారు.

కానీ,యాదృచ్ఛికంగా వర్షాకాలంలో ఇలాంటి సంఘటనలు ఎవరికైనా జరగవచ్చు. కాబట్టి, బూట్లు ధరించే ముందు, మీరు వాటిని జాగ్రత్తగా చెక్‌ చేసుకోవాలంటున్నారు. కొన్ని రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటనే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అక్కడ లెదర్ షూ లోపల చిన్న పాము కనిపించింది. ఆర్తి అనే మహిళ ఈ వీడియోను పోస్ట్ చేసింది. అలాగే చిన్న కర్రతో పామును బయటకు తీయడానికి ప్రయత్నించాడు. కానీ కర్ర మోపడంతో మరింత లోపలికి వెళ్లింది.. దీంతో ఆ మహిళ తన చేతులతో పామును బయటకు తీసుకొచ్చింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!