AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Olympics 2024: నదీ తీరం వద్ద ఒలింపిక్ ప్రారంభ వేడుకలు.. పతకాల ధర ఎంత ఎంతమంది క్రీడాకారులు పాల్గొంటున్నారంటే

ఫ్రాన్స్‌లో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముసిగిన నేపధ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఒలింపిక్ క్రీడల నిర్వహణపై ఉంది. ఇప్పటికే ఒలింపిక్ ఈవెంట్ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఒలింపిక్స్ క్రీడలు జరిగే ప్రాంతంలో డ్రోన్ తో దాడి చేస్తామని బెదిరింపుల నేపథ్యంలో.. ఇప్పటికే ఫ్రెంచ్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఒలింపిక్ ప్రారంభ వేడుకల వేదికలో మార్పు చేసింది. ఈసారి స్టేడియంలో కాకుండా, సెన్ నదిలో నిర్వహిస్తున్నారు. ఒలింపిక్స్ క్రీడలను వీక్షించడానికి హాజరయ్యే ప్రేక్షకుల సంఖ్యను కూడా పరిమితం చేసింది. ఏది ఏమైనప్పటికీ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో అనేక రకాల క్రీడలతో మనసులను ఆకట్టుకునేందుకు  క్రీడాకారులు సిద్దమవుతున్నారు

Paris Olympics 2024: నదీ తీరం వద్ద ఒలింపిక్ ప్రారంభ వేడుకలు.. పతకాల ధర ఎంత ఎంతమంది క్రీడాకారులు పాల్గొంటున్నారంటే
Paris Olympics 2024Image Credit source: X/Paris2024
Surya Kala
|

Updated on: Jul 17, 2024 | 11:57 AM

Share

పారిస్ ఒలింపిక్ క్రీడలు 2024 జూలై 26, 2024 నుంచి ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 11 వరకూ జరగనున్న ఈ సమ్మర్ ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి క్రీడా ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రీడాకారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయా దేశాల క్రీడాకారులు తమ సత్తాను చూపించి తమ దేశాలకు పతకాన్ని సాధించడం కోసం పారిస్ లో అడుగు పెట్టనున్నారు. అయితే ఫ్రాన్స్‌లో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముసిగిన నేపధ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఒలింపిక్ క్రీడల నిర్వహణపై ఉంది. ఇప్పటికే ఒలింపిక్ ఈవెంట్ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఒలింపిక్స్ క్రీడలు జరిగే ప్రాంతంలో డ్రోన్ తో దాడి చేస్తామని బెదిరింపుల నేపథ్యంలో.. ఇప్పటికే ఫ్రెంచ్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఒలింపిక్ ప్రారంభ వేడుకల వేదికలో మార్పు చేసింది. ఈసారి స్టేడియంలో కాకుండా, సెన్ నది తీరం వద్ద  నిర్వహిస్తున్నారు. ఒలింపిక్స్ క్రీడలను వీక్షించడానికి హాజరయ్యే ప్రేక్షకుల సంఖ్యను కూడా పరిమితం చేసింది.

  1. ఏది ఏమైనప్పటికీ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో అనేక రకాల క్రీడలతో మనసులను ఆకట్టుకునేందుకు  క్రీడాకారులు సిద్దమవుతున్నారు. మరోవైపు పారిస్ 2024 ఒలింపిక్స్ కు ఆతిధ్యం ఇస్తూ లండన్ రికార్డ్ ను సమానం చేసింది. పారిస్ మూడుసార్లు (1900, 1924,2024) వేసవి ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తుండడంతో లండన్‌ సరసన చేరింది.
  2. పారిస్ ఒలింపిక్స్‌ నిర్వహణకు రూ. 61,500 కోట్లు వెచ్చించినట్లు నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు.
  3. ఇక ఒలింపిక్ క్రీడలలో విజేతలుగా నిలిచే క్రీడాకారులకు అందించే ప్రతి పతకం ఖర్చు డిఫరెంట్ గా ఉందని తెలిపారు. క్రీడాకారులకు బహుకరించే గోల్డ్ మెడల్ ధర మన దేశ కరెన్సీలో రూ. 75 లక్షలు ఉండనుంది. వెండి పతకం ధర సుమారు రూ. 50 లక్షలు కాగా, కాంస్య ధర వరుసగా రూ. 30 లక్షలు.
  4. పారిస్ ఒలింపిక్స్ 2024లో ఉపయోగించే వేదికలు: పారిస్ ఒలింపిక్స్‌లో ఉపయోగించే వేదికల గురించి మాట్లాడితే ఈ ఈవెంట్‌లో క్రీడాకారుల పోటీల నిర్వహణ కోసం 35 వేదికలను ఉపయోగించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. వీటిలో దిగ్గజ రోలాండ్ గారోస్ (టెన్నిస్), స్టేడ్ డి ఫ్రాన్స్ (ఫుట్‌బాల్) ఉన్నాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. ఎంత మంది అథ్లెట్లు పాల్గొంటారంటే: పారిస్ ఒలింపిక్ క్రీడల్లో ప్రపంచ వ్యాప్తంగా 206 దేశాల నుంచి సుమారు 10,500 మంది అథ్లెట్లు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఈసారి భారత్ నుంచి 120 మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.
  7. పారిస్ ఒలింపిక్స్‌లో 300 ఈవెంట్‌లు: సమ్మర్ ఒలింపిక్స్‌లో 32 క్రీడాంశాల్లో 300 ఈవెంట్లలో 10,000 మంది అథ్లెట్లు పాల్గొంటారు. స్విమ్మింగ్ నుండి సైక్లింగ్ వరకు, 2024 పారిస్ ఒలింపిక్స్ వివిధ ఈవెంట్‌లను కలిగి ఉంది.
  8. ఈ క్రీడల సందర్భంగా 1.5 కోట్ల మందికి పైగా పర్యాటకులు పారిస్‌ను సందర్శిస్తారని అంచనా.
  9. పారిస్ ఒలింపిక్ గేమ్స్ 2024 లైవ్ స్ట్రీమింగ్ వివరాలు: పారిస్ ఒలింపిక్స్ 2024 ఈవెంట్‌లు స్పోర్ట్స్ 18 ఛానెల్‌లలో ప్రసారం చేయనున్నారు. అంతేకాదు Jio సినిమా యాప్, వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..