- Telugu News Photo Gallery Spiritual photos haridwar to varanasi best place in india for visit in shravana masam
Travel India: ఈ శైవ క్షేత్రాలకు వెళ్తున్నారా.. ఆ సమీపంలో ఉన్న అందమైన ప్రదేశాలపై కూడా ఓ లుక్ వేయండి..
శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం. శివ భక్తులతో పాటు, వరలక్ష్మీదేవి, మంగళ గౌరీ దేవిలను పుజిస్తారు. అంతేకాదు పుణ్యక్షేత్రాలలో ఉత్సాహం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా భక్తిపారవశ్యంలో నిండిన ఆలయాలు దర్శనం ఇస్తాయి. సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ప్రసిద్ధి చెందిన శివాలయాలను దర్శించుకుంటారు. శివుడి దర్శనం చేసుకోవడానికి వారణాసి, ఉజ్జయిని వంటి ప్రదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే.. ఇంకా ఏయే ప్రదేశాలను సందర్శించవచ్చో తెలుసుకుందాం..
Updated on: Jul 17, 2024 | 10:04 AM

చాలా మందికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం శ్రావణ మాసంలో ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకుంటున్నట్లయితే శివయ్య దర్శనంతో పాటు ఇతర యాత్ర స్థలాను సందర్శించాలని ప్లాన్ చేసుకోవచ్చు. అంటే దర్శనంతో పాటు సందర్శనా స్థలాలను కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రోజు ఆయా స్థలాలు ఏమిటో తెలుసుకుందాం.

వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరం కాశీ విశ్వనాథ ఆలయానికి ప్రసిద్ధి. శ్రావణ మాసంలో భారీ పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తారు. మీరు కాశికి వెళ్తున్నట్లు అయితే కాశీ విశ్వనాథ్‌తో పాటు అందమైన గంగా ఘాట్ వీక్షణలను ఆస్వాదించవచ్చు. ఇక్కడ ప్రసిద్ధ స్ట్రీట్ ఆహారాలను రుచి చూడడమే కాదు రామ్‌నగర్ కోట, కొత్త కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించవచ్చు.

మధ్యప్రదేశ్: శ్రావణ మాసంలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్‌కు వెళుతున్నట్లయితే.. ఖజురహో, చందేరి (ఈ కొండ పట్టణం ప్రకృతి అందాలతో నిండి ఉంది), రానే జలపాతం (ఈ జలపాతం ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం, ఇక్కడ సందర్శన చిరస్మరణీయమైనది)ను సందర్శించవచ్చు. పంచమర్హికి వెళ్ళవచ్చు ఈ హిల్ స్టేషన్ చాలా అందంగా ఉంది.

హరిద్వార్: శ్రావణ మాసంలో హరిద్వార్ వెళ్లాలనుకుని శివ భక్తులు భావిస్తారు. ఇక్కడ హర్ కి పౌరీ గంగా ఘాట్ ను సందర్శించవచ్చు. జ్వాలా దేవి, మానసా దేవి ఆలయాలను సందర్శించవచ్చు. అంతేకాదు కంఖాల్, శాంతికుంజ్, సప్తఋషి ఆశ్రమం సందర్శించవచ్చు. రిషికేశ్ ను సందర్శించడం పూర్తిగా భిన్నమైన అనుభవాన్ని ఇస్తుంది. అంతేకాదు రామ్-లక్ష్మణ్ జూలా, నీలకంఠ మహాదేవ ఆలయన్ని, త్రివేణి ఘాట్, బీటిల్స్ ఆశ్రమం, 13 మంజిల్ టెంపుల్ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.

మహారాష్ట్ర: 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది. శ్రావణ మాసంలో ఇక్కడికి వెళ్లాలని అనుకుంటే దానితో పాటు మహాబలేశ్వర్ కూడా వెళ్లవచ్చు. అంతేకాదు లోనావాలా, అజంతా, ఎల్లోరా గుహలు వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.

తమిళనాడు: రామనాథస్వామి శివునికి చెందిన ప్రసిద్ధి దేవాలయం. దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మించబడింది. ఇక్కడికి వెళితే మహాబలిపురం వెళ్లవచ్చు. ఈ ప్రదేశం UNESCO వరల్డ్ హెరిటేజ్‌లో చేర్చబడింది. ఇక్కడ ఉన్న పురాతన దేవాలయాలు, శిల్పాలు ఆకర్షణకు కేంద్రంగా ఉన్నాయి. అంతేకాదు వెయ్యి దేవాలయాల నగరంగా పిలువబడే కాంచీపురం వెళ్ళవచ్చు. కూర్గ్ ఇక్కడ అత్యంత అందమైన హిల్ స్టేషన్.

ఒడిశా: లింగరాజ్ ఆలయం ఒడిశాలోని భువనేశ్వర్‌లో నిర్మించబడింది. ఇది శివుని పురాతన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం కళింగ శైలిలో నిర్మించబడింది. వాస్తుశిల్పం చూడదగ్గది. శ్రావణ మాసంలో ఇక్కడకు వెళ్ళడం ఒక గొప్ప అనుభవం. ఇక్కడ కోణార్క్ టెంపుల్, చిలుక సరస్సు, నందన్ కన్హా జూ, హిరాకుడ్ డ్యామ్ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.




