Viral Video: వీడి పిచ్చి కోపం తగలెయ్య.. పోలీసులకే షాకిచ్చాడుగా… వీడియో చూసిన తర్వాత తల బాదుకుంటున్న నెటిజన్స్!
పోలీసులతో పెట్టుకోవడం కాదు.. నాతో పోలీసులు పెట్టుకుంటే ఏమౌతుందో చూడు అంటూ ఓ డంపర్ పోలీసులకు షాకిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులతో స్నేహం, శత్రుత్వం రెండూ మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు. ఈ సామెత కారణం...

పోలీసులతో పెట్టుకోవడం కాదు.. నాతో పోలీసులు పెట్టుకుంటే ఏమౌతుందో చూడు అంటూ ఓ డంపర్ పోలీసులకు షాకిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులతో స్నేహం, శత్రుత్వం రెండూ మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు. ఈ సామెత కారణం లేకుండా చెప్పలేదని ఒక్కోసారి అనిపిస్తుంటుంది. చాలా చోట్ల కొంత మంది పోలీసుల వైఖరితో ప్రజలు ఇబ్బంది పడుతుండటం చూస్తూ ఉంటాం. పోలీసులతో శత్రుత్వం ఒక్కోసారి ఖరీదైనదిగా మారతుంది.
అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో మాత్రం ఓ డంపర్ డ్రైవర్‌తో వాదన పోలీసులకు ఖరీదైనదిగా కనిపిస్తోంది. ఒక డంపర్ డ్రైవర్, పోలీసుల మధ్య రోడ్డు మీద ఏదో విషయంపై వాగ్వాదం జరిగినట్లు తెలుపస్తోంది. ఆ తర్వాత డంపర్ డ్రైవర్ చాలా కోపంగా ఉన్నాడని, అతను లారీలోని శిథిలాలను రోడ్డుపై పడవేసి అక్కడి నుండి వెళ్లిపోయాడని చెబుతున్నారు.
వీడియోలో డంపర్ డ్రైవర్ శిథిలాలను పడవేస్తూ రోడ్డుపై ఎలా ముందుకు వెళ్తున్నాడో మీరు చూడవచ్చు. ఈ సమయంలో చాలా మంది పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. కానీ ఎవరూ అతన్ని ఆపడానికి ప్రయత్నించలేదు. డంపర్ లో నుంచి అన్ని శిథిలాలు రోడ్డుపై పారవేసి డ్రైవర్ డంపర్‌తో హాయిగా పారిపోయాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే దాని గురించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. కానీ వీడియోలోని ‘చౌదరి మోటార్స్’ మరియు స్థానిక దుకాణాలపై కనిపించే సంకేతాల ఆధారంగా, ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని మోరెనాలో జరిగి ఉండవచ్చని ఖచ్చితంగా చెబుతున్నారు.
వీడియో చూడండి:
डंपर वाले को पुलिसवालों ने रोका, शायद कुछ लेन-देन का मामला रहा होगा। 🤔 ग़ुस्से में डंपर वाला इतना बौखला गया कि पुलिसवालों की जान आफ़त में डालने के लिए उसने सड़क पर ही मलबा गिरा दिया 🤣🤣 pic.twitter.com/4uN9Ph7rju
— 𝙼𝚛 𝚃𝚢𝚊𝚐𝚒 (@mktyaggi) August 26, 2025
కేవలం 47 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 3 లక్షల సార్లు వీక్షించారు, వందలాది మంది దీనిని లైక్ చేసి వివిధ రకాల ప్రతిస్పందనలు తెలియచేశారు. నేరస్తుడు తప్పించుకోలేడంట పోస్టులు పెడుతున్నారు. ‘ఈ డంపర్ డ్రైవర్లు ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తారు. అక్రమ మైనింగ్, ఓవర్‌లోడింగ్ పై పోలీసులు వారిని వెంబడించినప్పుడల్లా, వారు పోలీసులకు మార్గం మూసుకుపోయేలా వారి వస్తువులన్నింటినీ ఇలా దించుతారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
