Viral Video: ఫుల్లుగా తాగి ఫుట్‌పాత్‌ల మీద పడిపోయిన యువత… న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో వింత పోకడలు
జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. బాణసంచా కాంతులతో నింగి మెరిసిపోగా, కోట్లాది గొంతుకలు 'హ్యాపీ న్యూ ఇయర్' అంటూ కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్‌కమ్ పలికాయి. యువత పబ్‌లు, రిసార్టుల్లో డీజే పాటలకు స్టెప్పులేస్తూ న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెప్పారు. ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ...

జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. బాణసంచా కాంతులతో నింగి మెరిసిపోగా, కోట్లాది గొంతుకలు ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్‌కమ్ పలికాయి. యువత పబ్‌లు, రిసార్టుల్లో డీజే పాటలకు స్టెప్పులేస్తూ న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెప్పారు. ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ సందడి చేశారు. సరికొత్త లైటింగ్స్, లేజర్ షోలు, టపాసుల మోతలు, కేక్ కటింగ్‌లు, యువత ఉత్సాహం నడుమ కొత్త సంవత్సరం 2026 ఘనంగా ప్రారంభమైంది. నూతన సంవత్సర వేడుకలు అంతటా అట్టహాసంగా జరిగాయి. కొత్త ఆశలు, ఆశయాలతో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ 2026కి ఘన స్వాగతం పలికారు.
ప్రముఖ నగరాలు కొత్త సంవత్సరం సంబరాల వేళ విద్యుద్దీపాల వెలుగు జిలుగుల్లో మెరిశాయి. 2025కు వీడ్కోలు చెబుతూ 2026కు ఘన స్వాగతం పలుకుతూ సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా పరస్పరం న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుని సందడి చేశారు. ముఖ్యంగా యువత, టెక్ పీపుల్స్ యమ ఎంజాయ్ చేశారు. పీకల దాకా తాగి నడిరోడ్డు మీదే పడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నూతన సంవత్సర వేడుకల తర్వాత గురుగ్రామ్‌లోని సెక్టార్ 29, ఇతర నైట్‌లైఫ్ కేంద్రాల నుండి వచ్చిన వైరల్ ఫుటేజ్ యువ సంస్కృతి, ప్రజా భద్రతకు సంబంధించి జాతీయ స్థాయిలో చర్చను తిరిగి రాజేసింది. జనవరి 1న వెలుగులోకి వచ్చిన ఈ వీడియోలో, స్పష్టంగా మత్తులో ఉన్న యువతీ యువకుల దృశ్యాలు కనిపిస్తున్నాయి. నగరంలో ఫుట్‌పాత్‌లపై చాలా మంది పడిపోవడం, వాంతులు చేసుకోవడం కనిపించింది. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు హాస్యంగా స్పందించినప్పటికీ, ఈ దృశ్యాలు అధిక మద్యపానం వల్ల కలిగే ఆరోగ్య, భద్రతా ప్రమాదాల గురించి ఆందోళన రేకెత్తిస్తోంది.
వీడియో చూడండి:
गुड़गांव में कल रात की पार्टी के बाद के साइड इफेक्ट. pic.twitter.com/UpgBOCdxWw
— Arvind Sharma (@sarviind) January 1, 2026
Gurgaon new year After party Scence.
New year, New way of celebration. pic.twitter.com/JPxxUqDIRg
— Sumit (@beingsumit01) January 1, 2026
