Viral Video: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద విచిత్ర సంఘటన.. జాతీయ జెండాతో ఆకాశంలో విహరించిన కాకి..
స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా అధికారులు నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై జాతీయ పతాకాలను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.
Viral Video: దేశ వ్యాప్తంగా స్వాతంత్య దినోత్సవ వేడుకల సంబురాలు అంబరాన్ని తాకుతున్నాయి. స్వాతంత్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తి కావొస్తున్న సందర్భంగా ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. ఈ ఏడాది హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చెప్పారు. ప్రధాని పిలుపు మేరకు ప్రతి భారతీయుడి ఇంటి మీద జాతీయ పతాకం రెపరెపలాడుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కట్టడాలు కూడా త్రివర్ణ పతాక వర్ణాలను అద్దుకున్నాయి. స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా అధికారులు నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై జాతీయ పతాకాలను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.
నాగార్జున సాగర్ డ్యాం పై ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఒక కాకి ముక్కుతో పట్టుకుంది. ఈ జాతీయ పతాకాన్ని పట్టుకొని ఆకాశంలో కొంచెం సేపు విహరించింది. రిజర్వాయర్, డ్యాం మీదుగా చెక్కర్లు కొట్టింది. ఈ దృశ్యం అందరినీ అలరించింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..