AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: పెళ్లివేడుకలో వధూవరుల అత్యుత్సాహం . ఉరేగింపులో కాల్పులు జరిపిన కొత్త జంట..కేసు నమోదు

Viral Video: వివాహ ఉరేగింపులో కూడా అనేక మార్పులు వచ్చాయి. అయితే ఇప్పుడు ఒక నవ వధువు.వరుడు మరింత ముందుకు అడుగేసి.. సారికొత్తగా వివాహ ఊరేగింపులో వేడుకగా కాల్పులు జరిపారు. వీరు సంబరాలు జరుపుకుంటున్న కాల్పుల వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Viral News: పెళ్లివేడుకలో వధూవరుల అత్యుత్సాహం . ఉరేగింపులో కాల్పులు జరిపిన కొత్త జంట..కేసు నమోదు
Viral Video
Surya Kala
|

Updated on: May 31, 2022 | 2:05 PM

Share

Viral News: పూర్వకాలంలో వివాహ వేడుక అంటే సందడి.. సంబరాలు. వధువరుల కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు అందరూ కలిసి సంతోషంగా గడిపి జీవితాంతం గుర్తుంచుకునే అంద్దమైన జ్ఞాపకం.. కాలక్రమంలో అనేక విషయాల్లో మార్పులు వచ్చినట్లే.. పెళ్లికి పెళ్లి వేడుకలో కూడా అనేక మార్పులు వచ్చాయి. వివాహ వేదిక వద్దకు వచ్చే సమయంలో సిగ్గుతో తలదించుకుని వచ్చే పెళ్లి కూతురు.. డీజే , బ్యాండ్ మేళం.. డ్యాన్స్ లో ఎంట్రీ ఇస్తోంది. ఇక వివాహ ఉరేగింపులో కూడా అనేక మార్పులు వచ్చాయి. అయితే ఇప్పుడు ఒక నవ వధువు.వరుడు మరింత ముందుకు అడుగేసి.. సారికొత్తగా వివాహ ఊరేగింపులో వేడుకగా కాల్పులు జరిపారు. వీరు సంబరాలు జరుపుకుంటున్న కాల్పుల వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు దంపతులపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని మవానా పట్టణంలో ఆదివారం జరిగిన వివాహ ఊరేగింపులో వధూవరులు వేడుకలో  కాల్పులకు పాల్పడ్డారు. సంబరాల్లో కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ కావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. వీడియోలో, వధూవరులు కన్వర్టిబుల్ కారులో తమ వివాహ వేదిక వద్దకు  ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది. వీరు ఇలా ప్రవేసిస్తున్న సమయంలో వరుడు తన తుపాకీని తీసి గాలిలోకి కాల్పులు జరిపాడు. ఈ సమయంలో అక్కడ ఉన్న స్నేహితులు, అతిథులు ఉత్సాహపరిచినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ నవ దంపతులపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మీరట్ ఎస్పీ, కేశవ్ కుమార్ మాట్లాడుతూ.. తమ దృష్టికి వీడియో వచ్చిన తరువాత, కేసు నమోదు చేసి, కాల్పులకు ఉపయోగించిన ఆయుధానికి సంబంధించిన దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us