AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రెంచ్ ఫ్రైస్‌ వెనక ఇంత పెద్ద కథ ఉందా.. అసలు దానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా…?

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన స్నాక్స్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి. థియేటర్లలో సినిమా చూస్తున్నా, ఫ్రెండ్స్‌తో కలిసి హోటల్‌కి వెళ్లినా ఈ లాంగ్ పొటాటో ఫ్రైస్ ఆర్డర్ చేయడం మనకు అలవాటు. అయితే మనం ఎంతో ఇష్టంగా తినే ఈ ఫాస్ట్ ఫుడ్ వెనుక ఒక గ్రామం పడ్డ ఆకలి బాధలు, ఒక ప్రయోగం ఉన్నాయనే విషయం మీకు తెలుసా? ఆ విషయాలు తెలుసుకుందాం..

ఫ్రెంచ్ ఫ్రైస్‌ వెనక ఇంత పెద్ద కథ ఉందా.. అసలు దానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా...?
Why Are French Fries Called French Fries
Krishna S
|

Updated on: May 31, 2026 | 2:14 PM

Share

పిల్లల నుండి పెద్దల వరకు.. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. బర్గర్ తిన్నా, పిజ్జా ఆర్డర్ చేసినా.. పక్కన ఈ కరకరలాడే బంగాళాదుంప స్నాక్ ఉండాల్సిందే. అయితే దీని పేరులో ఫ్రెంచ్ అనే పదం ఉండటం చూసి ఈ ఫాస్ట్ ఫుడ్ మొదట ఫ్రాన్స్ దేశంలోనే పుట్టిందని దాదాపు అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ అల్టిమేట్ స్నాక్ పుట్టింది ఫ్రాన్స్‌లో కాదు.. మరో యూరోపియన్ దేశంలో. అసలు దీనికి ఫ్రెంచ్ ఫ్రైస్ అనే పేరు ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర చాలా మందికి తెలియదు.

ఆకలి తీర్చిన చేపల ప్రయోగం

చారిత్రక నివేదికల ప్రకారం.. ఫ్రెంచ్ ఫ్రైస్ మూలాలు బెల్జియం దేశంలో 17వ శతాబ్దం చివరి నాటివి. బెల్జియంలోని నమూర్ అనే ప్రాంతం గుండా ప్రవహించే మ్యూస్ నది సమీపంలో నివసించే స్థానిక గ్రామస్థులు తమ రోజువారీ ఆహారం కోసం చిన్న చేపలపై ఆధారపడేవారు. వారు ఆ చేపలను పట్టి నూనెలో వేయించుకుని తినేవారు. అయితే ఒక ఏడాది చలికాలంలో చలి తీవ్రతకు ఆ నది మొత్తం గడ్డకట్టుకుపోయింది. దీంతో చేపలు పట్టడం అసాధ్యమై, గ్రామంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. ఆకలితో అలమటిస్తున్న గ్రామస్తులు వేయించిన చేపలకు ప్రత్యామ్నాయంగా ఒక వినూత్న ప్రయోగం చేశారు. ఇంట్లో ఉన్న బంగాళాదుంపలను చిన్న చేపల ఆకారంలో పొడవుగా, సన్నగా ముక్కలుగా కోసి, మరుగుతున్న నూనెలో వేయించారు. ఈ క్రేజీ ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. కరకరలాడే ఆ పొటాటో ముక్కలు స్థానికులలో విపరీతంగా పాపులర్ అయ్యాయి.

మొదటి ప్రపంచ యుద్ధం.. అమెరికన్ సైనికుల పొరపాటు

బెల్జియంలో పుట్టిన ఈ వంటకానికి ఫ్రెంచ్ ఫ్రైస్ అనే పేరు రావడానికి మొదటి ప్రపంచ యుద్ధంతోబలమైన సంబంధం ఉంది. యుద్ధ సమయంలో అమెరికన్ సైనికులు బెల్జియంలో మోహరించి ఉండేవారు. ఆ సమయంలో అక్కడి స్థానికులు అమెరికన్ ఆర్మీకి ఈ వేయించిన బంగాళాదుంప వంటకాన్ని రుచి చూపించారు. అయితే ఆ కాలంలో బెల్జియన్ సైన్యంలో, అక్కడి అనేక ప్రాంతాలలో ఫ్రెంచ్ భాషను విస్తృతంగా మాట్లాడేవారు. చుట్టుపక్కల వారంతా ఫ్రెంచ్ మాట్లాడటం విన్న అమెరికన్ సైనికులు.. తాము ఫ్రాన్స్ సరిహద్దుల్లో ఉన్నామని లేదా తాము తింటున్నది ఒక ఫ్రెంచ్ వంటకం అని పొరపాటు పడ్డారు. అలా వారు ఈ వంటకాన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అని పిలవడం ప్రారంభించారు. ఆ పేరు కాస్తా ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిపోయింది.

బెల్జియం స్టైల్ ఫ్రైస్ స్పెషాలిటీ ఏంటి?

నేటికీ బెల్జియం దేశం గర్వంగా తమను ఫ్రెంచ్ ఫ్రైస్ అసలు జన్మస్థలంగా భావిస్తుంది. మనకు సాధారణ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో దొరికే ఫ్రైస్‌కు, బెల్జియం ఫ్రైస్‌కు చాలా తేడా ఉంటుంది.

డబుల్ ఫ్రైడ్ టెక్నిక్: బెల్జియన్ శైలి ఫ్రెంచ్ ఫ్రైస్ సాధారణంగా కొంచెం మందంగా ఉంటాయి. వీటిని లోపల మెత్తగా, బయట విపరీతమైన కరకరలాడేలా చేయడానికి ఏకంగా రెండుసార్లు నూనెలో వేయిస్తారు.

నో కెచప్: వీరు మనలా టమోటో కెచప్‌తో కాకుండా రకరకాల స్పెషల్ మేయోనైస్ సాస్‌లతో ఈ ఫ్రైస్‌ను వడ్డిస్తారు.

Follow Us