Viral News: గత ఏడాదిలో 50 లక్షలు ఖర్చు చేసిన ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్.. ఇంత ఆదాయం ఎలా వచ్చిందమ్మా అంటున్న నెటిజన్లు..
ప్రస్తుతం ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ శరణ్య అయ్యర్ ఒక సంవత్సరంలో ట్రావెలింగ్ కోసం లక్షలు ఖర్చు చేసి వార్తల్లో నిలిచింది. 33 ఏళ్ల ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ శరణ్య అయ్యర్ గత ఏడాది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అర కోటికి పైగా ఖర్చు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తాను తన సంపాదనలో ఎక్కువ భాగం ప్రపంచ పర్యటన కోసం ఖర్చు చేశానని చెప్పింది. దీంతో ఇప్పుడు శరణ్య అయ్యర్ ఎవరు? ఆమె జీవనశైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ శరణ్య అయ్యర్ 2024లో ప్రపంచాన్ని పర్యటించడానికి రూ. 20 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రయాణాల పట్ల శరణ్యకు ఉన్న అభిరుచి, ఆమె జీవనశైలి ఇప్పుడు ప్రజలకు ప్రేరణగా నిలిచింది. శరణ్య జీవన శైలి చర్చనీయాంశంగా మారింది. అయితే శరణ్య ఇంతకుముందు డబ్బు ఆదా చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టానని.. ఇప్పుడు తన ఆలోచనలో మార్పులు వచ్చాయని.. అందుకనే తన సంపాదనలో ఎక్కువ భాగం ప్రపంచ పర్యటనలకే వెచ్చిస్తున్నానని చెప్పింది. శరణ్య ఫాలోవర్స్ ఇప్పుడు ఆమె ఆదాయ వనరు ఏమిటి అని అడుగుతున్నారు? అంతేకాదు ఇన్ని లక్షలు ఎలా సంపాదించింది అంటూ ఆశ్చర్యపోతున్నారు?
ఇన్‌స్టాగ్రామ్‌లో అర మిలియన్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్న 33 ఏళ్ల శరణ్య అయ్యర్.. గత ఏడాదిలో తాను పెట్టిన ఖర్చులను గురించి చెప్పింది. 2024లో ఆరు కంటే ఎక్కువ దేశాలకు వెళ్లినట్లు చెప్పింది. ఈ వ్లాగర్ దాదాపు రూ. 5 లక్షలను విమానంలో ప్రయాణించడానికి మాత్రమే ఖర్చు చేసింది. మిగిలిన మొత్తంలో ఎక్కువ భాగం వసతి, ఇతర కార్యకలాపాలకు ఖర్చు చేసినట్లు తెలిపింది. దీంతోపాటు రూ.22 లక్షలతో కొత్త హ్యుందాయ్ కారు కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. వైద్యానికి రూ.5 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపింది.
శరణ్య షేర్ చేసిన వీడియో పోస్ట్ ప్రకారం.. లావోస్, థాయ్‌లాండ్ పర్యటనకు రూ. లక్ష ఖర్చు చేయగా, మదీరాలో రూ. 1.5 లక్షలు, తన తల్లిదండ్రులతో దక్షిణాఫ్రికా పర్యటనకు రూ. 8 లక్షలు, గ్రీన్లాండ్ పర్యటనకు రూ. 3 లక్షలు ఖర్చు చేసింది. అంతేకాదు శరణ్య ఐస్‌లాండ్‌ను మూడుసార్లు సందర్శించింది. ఇందు కోసం రూ. 2.5 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపింది.
View this post on Instagram
అదే సమయంలో శరణ్య అయ్యర్ ఐరోపాలో వేసవి సెలవులను ఎంజాయ్ చేసినట్లు తెలిపింది. క్యాసినోలో రూ.60 వేలు గెలుపొందగా రూ.40 వేలు ఖర్చుచేసినట్లు చెప్పింది. అయితే గత ఏడాదిలో చేసిన ఖర్చుల్లో తిన్న ఆహారం, రోజువారీ వస్తువులు, ఇతర అవసరాలకు చేసిన ఖర్చును కలప లేదు. అయితే తాను 2025లో ఇంకా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలనుకుంటున్నట్లు తెలిపింది.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
View this post on Instagram
ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షలాది మంది వీక్షించగా.. ఎక్కువ మంది ఆశ్చర్యకరంగా కామెంట్లు చేస్తున్నారు. ఒకరు ఆదాయానికి మూలం ఏమిటి అని ఒకరు అడిగారు. మరొకరు ఇది డబ్బును వృధా చేయడం అని చెప్పారు. దీన్ని మూర్ఖత్వం అంటారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు దీన్ని చూసి షాక్ అవుతారని మరో యూజర్ వ్యాఖ్యానించారు. మరొకరు ఇన్‌కమ్ టాక్స్ వ్యక్తులు కూడా ఇన్‌స్టాగ్రామ్‌ను చూస్తారు “జాగ్రత్తగా దీదీ” అని చమత్కరంగా కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..