Viral Video: బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చిన పోలీసు అధికారి.. నెట్టింట్లో వీడియో వైరల్..

కొందరు వ్యక్తులు ఇన్‌స్పెక్టర్‌ను పట్టుకుని రక్త నమూనాలు ఇవ్వడానికి తీసుకువచ్చినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఇన్స్పెక్టర్ అప్పటికే వణుకుతున్నాడు.. డాక్టర్ కు చేతులు జోడించి దణ్ణం పెట్టాడు

Viral Video: బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చిన పోలీసు అధికారి.. నెట్టింట్లో వీడియో వైరల్..
Vral Video
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Jul 20, 2022 | 2:26 PM

Viral Video: కొన్నిసార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. ఆ వీడియోలు ప్రజలను నవ్విస్తాయి. తాజాగా ఓ పడీపడీ మరి నవ్వించే ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ఉత్తరప్రదేశ్ పోలీస్‌ పేజీలో ఓ ఇన్‌స్పెక్టర్ పోస్ట్‌లో చేశారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి నుంచి రక్త పరీక్ష కోసం శాంపిల్స్ ఇస్తున్న సమయంలో అతను పడిన పాట్లు..ఉన్నాయి. వీడియోలో పెద్దతను శాంపిల్ ఇవ్వడం తప్పించుకోవానికి అతను పడిన తిప్పలు.. పిల్లలు కూడా పడరు అనిపిస్తుంది. సాధారణంగా పిల్లలకు ఇంజెక్షన్లు ఇచ్చే సమయంలో వారు భయంతో లేదా ఇంజెక్షన్ ఇస్తే నొప్పిరావడంతోనే ఏడుస్తారు. కొంతమంది పిల్లలు బిగ్గరగా అరవడం కూడా సర్వసాధారణంగా జరిగేదే. అయితే ఇలా పెద్దలు చేయడం చాలా అరుదు.. అందులోనూ ఓ పోలీసు అయి ఉంది.. బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి భయపడుతున్న తీరు ఆశ్చర్యాన్ని.. నవ్వుని తెప్పిస్తుంది.

కొందరు వ్యక్తులు ఇన్‌స్పెక్టర్‌ను పట్టుకుని రక్త నమూనాలు ఇవ్వడానికి తీసుకువచ్చినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఇన్స్పెక్టర్ అప్పటికే వణుకుతున్నాడు.. డాక్టర్ కు చేతులు జోడించి దణ్ణం పెట్టాడు. అతను ఇంజెక్షన్ చూసిన తర్వాత ఇన్‌స్పెక్టర్‌ పరిస్థితి మరింత దిగజారింది. అతను వింతగా ప్రవర్తించడం, కొంచెం గొణుగడం ప్రారంభించాడు. అతనితో పాటు ఉన్న వ్యక్తులు అతని చేయి పట్టుకున్నారు. అతి కష్టం మీద డాక్టర్ ఇన్‌స్పెక్టర్‌ దగ్గర నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేశాడు. ఈ సమయంలో, ఇన్‌స్పెక్టర్ చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించాడు. అయితే డాక్టర్ ఇన్స్పెక్టర్ చేతి సిరలోకి ఇంజెక్షన్‌ను ఇంజెక్ట్ చేసి రక్త నమూనాను తీసుకున్నాడు. ఇంజక్షన్ అతని చేతి నుంచి బయటకు తీసిన తర్వాత.. అంతే అయిపోయింది’ అని ఇన్‌స్పెక్టర్‌ తో చెప్పినప్పుడు.. హమ్మయ్య అంటూ ఇన్స్‌పెక్టరు ఊపిరి పీల్చుకున్నాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by GiDDa CoMpAnY (@giedde)

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో గిడ్డే ID పేరుతో తో షేర్ చేశారు. ‘రక్త పరీక్ష కోసం నమూనాను ఇస్తున్న యుపి పోలీసుల డ్రోగా’ అనే క్యాప్షన్ కూడా జతచేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 61 వేలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. వేలాది మంది లైక్ చేసారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తలను చదవడానికి క్లిక్ చేయండి