Viral: ఇంద్ర భగవాన్‌పై చర్యలు తీసుకోండి.. జిల్లా మేజిస్ట్రేట్‌కు ఓ రైతు ఫిర్యాదు.. ఎందుకంటే..?

Viral News: వర్షాలు కురవకపోవడంతో యూపీలోని కొన్ని జిల్లాల్లో ఓ రకంగా కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. రైతులు చినుకు రాక కోసం కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. వర్షాలు కరవలేదని ఓ స్థానిక రైతుకు కోపం వచ్చింది.

Viral: ఇంద్ర భగవాన్‌పై చర్యలు తీసుకోండి.. జిల్లా మేజిస్ట్రేట్‌కు ఓ రైతు ఫిర్యాదు.. ఎందుకంటే..?
UP Farmer ComplaintImage Credit source: Twitter
Follow us
Janardhan Veluru

|

Updated on: Jul 20, 2022 | 11:25 AM

తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వరదల కారణంగా తీవ్ర నష్టం జరిగింది. ఇక్కడ పరిస్థితి ఇలా ఉండగా.. యూపీలో మాత్రం సీన్ మరో రకంగా ఉంది. వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. వర్షాలు కురవకపోవడంతో యూపీలోని కొన్ని జిల్లాల్లో ఓ రకంగా కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. రైతులు చినుకు రాక కోసం కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. వర్షాలు కురవలేదని ఓ రైతుకు కోపం వచ్చింది. తమ ప్రాంతంలో వర్షాలు కురవకపోవడానికి ఆకాశ దేవుడైన ఇంద్రుడే కారణమని భావించాడు. దీంతో ఇంద్రుడిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైతు ఫిర్యాదు మేరకు ఇంద్ర భగవాన్‌పై తదుపరి చర్యలకు సీనియర్ రెవెన్యూ అధికారి సిఫార్సు చేయడం చర్చనీయాంశంగా మారింది.

గోండ్ జిల్లాలోని జాలా గ్రామానికి చెందిన సుమిత్ కుమార్ యాదవ్ ఓ సన్నకారు రైతు. రైతుల సమస్యల పరిష్కారం కోసం శనివారంనాడు స్థానికంగా రెవెన్యూ అధికారులు నిర్వహించిన ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తమ ప్రాంతంలో వర్షాలు కురవకపోవడంతో తనతో పాటు రైతులందరూ ఇబ్బంది పడుతున్నారని ఆ రైతు తన ఫిర్యాదు లేఖలో ఆవేదన వ్యక్తంచేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా జనజీవనంపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. దీనికి బాధ్యుడైన ఇంద్ర భగవాన్‌పై చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్‌‌ను ఉద్దేశించి రాసిన ఫిర్యాదు లేఖలో ఆ రైతు పేర్కొన్నారు.

సదరు రైతు తహసీల్దారుకు ఈ ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ లేఖను అందుకున్న రెవెన్యూ అధికారి వర్మ.. అందులో ఏమి రాసుందో చదవకుండానే తదుపరి చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ డిప్యూటీ మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు లేఖను పంపడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఫిర్యాదు లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అలాంటి లేఖ ఏదీ తాను అధికారులకు ఫార్వార్డ్ చేయలేదని రెవెన్యూ అధికారి వర్మ తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అలాంటి ఫిర్యాదు లేఖ ఏదీ తన పరిశీలనకు రాలేదని.. అందులోని సీల్, తన సంతకం రెండూ నకిలీదిగా చెప్పుకొచ్చారు. దీన్ని ఎవరు తయారుచేశారో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తలు చదవండి..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు