AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: రోడ్డు పక్కన దుస్తులు అమ్మే వ్యాపారికి సెక్యూరిటీగా ఇద్దరు సాయుధ పోలీసులు.. ఎందుకంటే..?

ఉత్తర్‌ప్రదేశ్‌లో తోపుడు బండిపై వస్త్రాలు విక్రయించే ఓ వ్యక్తికి ఇద్దరు సాయుధ పోలీసులు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటున్నారు. ఎందుకో.. అసలు ఆ స్టోరీ ఏమిటో తెలుసుకుందాం పదండి.

Viral: రోడ్డు పక్కన దుస్తులు అమ్మే వ్యాపారికి సెక్యూరిటీగా ఇద్దరు సాయుధ పోలీసులు.. ఎందుకంటే..?
Guards To Street Vendor
Ram Naramaneni
|

Updated on: Jul 20, 2022 | 8:52 AM

Share

Trending: అతను రోడ్డు పక్కన తోపుడు బండిపై దుస్తులు అమ్ముకునే పేద వ్యక్తి. కానీ ఇద్దరు పోలీసులు గన్నులతో నిరంతరం అతనికి సెక్యూరిటీగా ఉంటున్నారు. అంత సాదాసీదా మనిషికి సెక్యూరిటీ ఎందుకని ఎవ్వరికీ అర్థం కావడం లేదు. సాయుధ పోలీసులు ఆ వీధి వ్యాపారికి రక్షణగా ఉన్న ఫోటోలు ప్రజంట్ నెట్టింట వైరల్‌‌గా మారాయి. దీని వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందాం పదండి. ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లోని ఎటా(Etah) జిల్లాకు చెందిన రామేశ్వర్‌ దయాల్‌ తోపుడు బండిపై దుస్తులు అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తన భూమికి పట్టా ఇప్పించాలంటూ ఎస్పీ(Samajwadi Party) సీనియర్ నేత రామేశ్వర్‌ సింగ్‌ సోదరుడు జుగేంద్ర సింగ్‌ను కలిశాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య వివాదం తలెత్తింది. కులం పేరుతో జుగేంద్ర తనను దూషించారని రామేశ్వర్‌ పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీనిపై జుగేంద్ర హైకోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలోనే  రామేశ్వర్‌ దయాల్‌ను కోర్టులో హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టుకు వచ్చిన దయాల్‌ను చూసిన జడ్జి ఆశ్చర్యానికి గురయ్యారు. ఓ బాధితుడికి ఎందుకు భద్రత కల్పించలేదని పోలీసులను ప్రశ్నించారు. ఇద్దరు బాడీగార్డులను భద్రతగా నియమించాలని ఆదేశించారు. దీంతో స్థానిక పోలీసులు అతనికి రక్షణ కల్పిస్తున్నారు.

జాతీయ వార్తల కోసం..

Follow Us
చంద్రగ్రహణం ముగిసింది..! ఇప్పుడు తప్పక చేయాల్సిన పనులు ఇవే..
చంద్రగ్రహణం ముగిసింది..! ఇప్పుడు తప్పక చేయాల్సిన పనులు ఇవే..
చంద్రగ్రహణం రోజున రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో
చంద్రగ్రహణం రోజున రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో
మూడేళ్లుగా వాగులో బండరాయిగా వదిలేశారు.. తీరా చూస్తే షాక్!
మూడేళ్లుగా వాగులో బండరాయిగా వదిలేశారు.. తీరా చూస్తే షాక్!
చీపురును ఈ మూలన పెడితే డబ్బే డబ్బు.. లక్ష్మీ కటాక్షం ఉండాలంటే ఇలా
చీపురును ఈ మూలన పెడితే డబ్బే డబ్బు.. లక్ష్మీ కటాక్షం ఉండాలంటే ఇలా
కులం కారణంగా నాకు అవకాశాలు ఇవ్వలేదు..
కులం కారణంగా నాకు అవకాశాలు ఇవ్వలేదు..
వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? ఎలా చేయాలి..? సూపర్ టిప్స్..
వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? ఎలా చేయాలి..? సూపర్ టిప్స్..
ప్రేమంటే ఇదేరా..? టర్కీ కోడి చనిపోతే.. తల్లడిల్లిన మరో కోడి..
ప్రేమంటే ఇదేరా..? టర్కీ కోడి చనిపోతే.. తల్లడిల్లిన మరో కోడి..
ఎంబీఏ చదివి ఇదేం పనిరా..? ఏకంగా మహిళా పోలీస్‌కే మస్కా కొట్టాడు..
ఎంబీఏ చదివి ఇదేం పనిరా..? ఏకంగా మహిళా పోలీస్‌కే మస్కా కొట్టాడు..
యుద్ధం ఉద్రిక్తతల మధ్య భారత రక్షణశాఖ సంచలన నిర్ణయం!
యుద్ధం ఉద్రిక్తతల మధ్య భారత రక్షణశాఖ సంచలన నిర్ణయం!
కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..
కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..