AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదో అరుదైన చేప.. రెగ్యూలర్‌గా తింటే బీపీ, షుగర్‌ ఇట్టే పరార్..! దొరుకుడు మహా కష్టం..

చేప అనే పదం వినగానే.. చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతాయి. చేపల వంటకాలు చాలా రుచికరంగా ఉంటాయి.. అది నిజమే.. కానీ, చేపలంత ఆరోగ్యకరమైన ఆహారం మరొకటి లేదని మీకు తెలుసా? అవును, ఇటీవలి కాలంలో చాలా మంది వైద్యులు చేపలు తినమని సిఫార్సు చేస్తున్నారు. అంతేకాదు.. కొన్ని రకాల వ్యాధులకు చేపలు ఔషధం కంటే ప్రభావవంతమైనవిగా నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి చేపలు లోతైన సముద్రంలో ఉంటాయి. సంవత్సరానికి రెండు లేదా మూడు మాత్రమే లభిస్తాయి. పైగా వీటికి డిమాండ్‌ కూడా చాలా ఎక్కువ.

ఇదో అరుదైన చేప.. రెగ్యూలర్‌గా తింటే బీపీ, షుగర్‌ ఇట్టే పరార్..! దొరుకుడు మహా కష్టం..
Bhola Bhetki Fish
Jyothi Gadda
|

Updated on: Aug 23, 2025 | 8:08 AM

Share

ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో ఒక సముద్రపు చేప మధుమేహం, అధిక రక్తపోటు, కాలేయ సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు గుర్తించారు. భారత తీర ప్రాంత జలాల్లో లభించే భోళా భేట్కీ అనే సముద్రపు చేప ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉందని పరిశోధకులు గుర్తించారు. కానీ, ఈ చేపలకు ఉండే ఘాటైన వాసన కారణంగా చాలామంది వీటిని పట్టించుకోరని చెప్పారు. కానీ, ఈ చేప అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉందని చెప్పారు.

ఈ చేపలపై పశ్చిమ మేదినీపూర్‌లోని బేల్దా కాలేజ్, విద్యాసాగర్ యూనివర్సిటీ, మేదినీపూర్‌లోని రాజా నరేంద్రలాల్ ఖాన్ ఉమెన్స్ కాలేజ్ ప్రొఫెసర్లు, విద్యార్థులు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో పలు కీలక విషయాలు వెల్లడించారు. ప్రొఫెసర్ కౌశిక్ దాస్ (బేల్దా కాలేజ్) నేతృత్వంలో 2017-18లో ఈ అధ్యయనం ప్రారంభమైంది. ప్రొఫెసర్ శ్రాబంతి పెయిన్, జయశ్రీ లాహా, సంజయ్ దాస్, సుప్రియ భౌమిక్, సయన్ పాండా అనే విద్యార్థి పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.

ప్రొఫెసర్ శ్రాబంతి పెయిన్ తెలిపిన వివరాల ప్రకారం, భోళా భేట్కీని చేపను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం తగ్గిందని చెప్పారు.. ఈ పరిశోధనలో, సముద్రపు చేపలు తినేవారిలో కీళ్ల నొప్పులు, ఋతుక్రమ సమస్యలలో గణనీయమైన మెరుగుదల కనిపించిందని చెప్పారు. తీర ప్రాంతాలలోని 124 మందిపై జరిపిన అధ్యయనంలో, కేవలం ముగ్గురు లేదా నలుగురికి మాత్రమే డయాబెటిస్ ఉన్నట్లు గుర్తించారు. అయితే మంచి నీటి చేపలు తినేవారిలో దాదాపు 30 శాతం మందికి డయాబెటిస్ ఉంది.

ఇవి కూడా చదవండి

ప్రయోగశాలలో ఎలుకలపై చేసిన పరీక్షల్లో వాటి సాధారణ ఆహారంతో పాటు చక్కెర అధికంగా ఉండే ఆహారం, సముద్రపు చేపలను అందించామని చెప్పారు. కొద్ది రోజలు తరువాత ఫలితాలు ఆశ్చర్యపరిచాయని పరిశోధకులు చెప్పారు. ఎలుకలలో రక్తంలో చక్కెర స్థాయిలు అసాధారణంగా తక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఇది భోళా భేట్కీలోని భాగాలు హైపర్‌గ్లైసీమియా (అధిక రక్త చక్కెర)తో చురుకుగా పోరాడుతున్నాయని సూచిస్తుందని పరిశోధకులు వివరించారు. ఈ చేపలోని క్రియాశీలక పదార్థాన్ని క్యాప్సూల్ రూపంలో వేరు చేయగలిగితే, డయాబెటిస్ చికిత్సలో అది ఒక విప్లవాత్మక మార్పును తీసుకురాగలదని పరిశోధకులు భావిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..