అద్భుతం.. మర్రిఊడలతో అలంకరించిన గణనాథుడు.. చూసేందుకు క్యూ కడుతున్న భక్తులు
అటు, గణేష్ నగర్ లోనీ హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసిన సిద్దివినాయకునికి రంగవళ్లులతో వినాయకుని, శివలింగం ప్రతిరుపాలను ఏర్పాటు చేసి దాని చుట్టూ సహస్ర దీపాలంకరణ చేసి అందంగా తీర్చిదిద్దారు. అలంకరణ పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సిద్దిపేట పట్టణంలో పలు వినాయక మండపాలను ఆహ్లాదంగా, వినోదంగా , ప్రకృతితో మమేకమై తీర్చిదిద్దారు..సిద్దిపేట పట్టణంలోని శంకర్ నగర్ లో వీర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకునికి మర్రి ఉడాలతో డెకరేషన్ చేసి అందంగా తీర్చిదిద్దారు. ఈ గణనాథున్ని చూస్తే సహజ సిద్ధమైన అడవిలో మర్రి ఉడల మధ్యలో వినాయకుణ్ణి నెలకొల్పినట్లు ఉన్నాడు.
మర్రి ఉడాలకు కలర్ పుల్ లైటింగ్ ఏర్పరచి కన్నులు మిరిమిట్లు గొలిపే విధంగా గణనాథుని ఏర్పాటు చేశారు. ప్రకృతి ఒడిలో లంబోదరున్ని ఏర్పాటు చేయడంతో ఈ వినాయకుణ్ణి చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.
అదేవిధంగా గణేష్ నగర్ లోనీ హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసిన సిద్దివినాయకునికి రంగవళ్లులతో వినాయకుని, శివలింగం ప్రతిరుపాలను ఏర్పాటు చేసి దాని చుట్టూ సహస్ర దీపాలంకరణ చేసి అందంగా తీర్చిదిద్దారు. అలంకరణ పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..