Watch: కలియుగ ద్రౌపది.. అన్నాదమ్ముళ్లిద్దరినీ ఒకేసారి పెళ్లి చేసుకున్న యువతి.. గ్రాండ్‌గా సెలబ్రెషన్స్..
ఈ సంప్రదాయాన్ని జోడిధారణ లేదా ద్రౌపది ప్రాథ అని పిలుస్తారు. ఈ సంప్రదాయంలో అన్నదమ్ముళ్లు ఒకే భార్యను షేర్ చేసుకుంటారు. ఈ వివాహ వేడుకను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. పాహరి సంప్రదాయ పాటలు, డ్యాన్స్‌లతో పెళ్లికి వచ్చిన అతిథులు బంధుమిత్రులంతా పెళ్లి వేడుకను ఎంజాయ్ చేశారు.

భారతదేశం…గొప్ప ఆచార వ్యవహరాలు, వైవిధ్యమైన వివాహ సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందింది. ఈ సంప్రదాయాలు ప్రాంతం, మతం, సమాజం వారీగా మారుతూ ఉంటాయి. కానీ, వేడుక ఏదైనా సరే.. ఉత్సాహభరితంగా సాగుతాయి. రంగులు, సంగీతం, నృత్యం, కూడిన సంబరాలు సాగుతుంటాయి. ఇటీవల, హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక పురాతన హట్టి పాలియాండ్రీ సంప్రదాయం అందరి దృష్టిని దృష్టిని ఆకర్షించింది. అక్కడ ఇద్దరు అన్నాదమ్ములు ఒకే యువతిని ఒకే వేదికపై ఒకేసారి వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో ఇలాంటి వింత సంఘటన చోటు చేసుకుంది. సిర్మౌర్ జిల్లాలోని హట్టి తెగకు చెందిన అన్నదమ్ములు ఇద్దరు ఒకే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ప్రదీప్ నేగి, కపిల్ నేగి అనే ఇద్దరు అన్నాదమ్ములు కున్హత్ గ్రామానికి చెందిన సునీతను ఒకే సారి ఒకేవేదికపై పెళ్లి చేసుకున్నారు. హట్టి వర్గ ప్రజల్లో ఉండే ఈ సంప్రదాయాన్ని జోడిధారణ లేదా ద్రౌపది ప్రాథ అని పిలుస్తారు. ఈ సంప్రదాయంలో అన్నదమ్ముళ్లు ఒకే భార్యను షేర్ చేసుకుంటారు. ఈ వివాహ వేడుకను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. పాహరి సంప్రదాయ పాటలు, డ్యాన్స్‌లతో పెళ్లికి వచ్చిన అతిథులు బంధుమిత్రులంతా పెళ్లి వేడుకను ఎంజాయ్ చేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
అయితే, హట్టి తెగలో ఉన్న ఈ ఆచారం ఇన్నాళ్ల వరకు చాలా గోప్యంగా జరిగేదట. కానీ, ఇప్పుడు నేగి సోదరుల వివాహం అత్యంత వేడుకగా జరిగింది. ఇది చూసిన ప్రజలంతా ఆశ్చర్యపోయారు. కానీ, శతాబ్ధాల క్రితం నాటి సంప్రదాయాన్ని నిలబెట్టారంటూ హట్టి తెగ వాసులు గొప్పగా చెప్పుకుంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




