Watch Video: గుజరాత్‌లో మరో విమాన ప్రమాదం.. అమ్రేలి ఎయిర్‌పోర్టులో కూలిన ట్రైనీ ఫ్లైట్
గుజరాత్‌లోని అమ్రేలి విమానాశ్రయంలో పెనుప్రమాదం తప్పింది. ల్యాండ్ అవుతుండగా సింగిల్ సీటర్ ట్రైనర్ విమానం రన్‌వేపై నుంచి అదుపుతప్పి పక్కకు జారీపోయింది. అయితే ట్రైనీ పైలట్ మాత్రం ఎటువంటి గాయాల లేకుండా బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇటీవల వివమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 3 నెలల క్రితమే గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదం గురించి మరువక ముందే మరో ప్రమాదం జరిగింది. కానీ అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గుజరాత్‌లోని అమ్రేలి ఎయిర్‌పోర్టులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన సింగిల్ సీటర్ ట్రైనర్ ఫ్లైట్ ఆదివారం మధ్యాహ్నం అమ్రేలి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వేపై నుంచి పక్కకు జారిపోయింది. ఆ తర్వాత పక్కనున్న గడ్డలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విమానం కొంత దెబ్బతిన్నప్పటికీ, ట్రైనీ పైలట్ మాత్రం ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు.
ఈ సంఘటనపై ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందినదని అమ్రేలి కలెక్టర్ వికల్ప్ భరద్వాజ్ మాట్లాడుతూ ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ట్రైనీ పైలట్ సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు. పైలట్‌కు ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. కానీ శిక్షణ విమానం కొద్ది మేర దెబ్బతిన్నదని వివరించారు. ప్రమాదానికి గల కారణాలపై పౌర విమానయాన అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
అయితే ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఉన్న ఒక వ్యక్తి విమానం ప్రమాదానికి గురవుతున్న దృశ్యాలను తన ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియో చూడండి..
Amreli માં મીની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરકી ગયું, દુર્ઘટના ટળી | Gujarat Samachar#Amreli #Gujarat #GujaratiNews #GujaratSamachar pic.twitter.com/Nx7jQ2ZEDI
— Gujarat Samachar (@gujratsamachar) September 28, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
