AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: తిక్క కుదిరిందిగా.. రోడ్డుపై ప్రమాదకర స్టంట్స్.. కట్‌చేస్తే..

రోజురోజుకూ యువత రెచ్చిపోతున్నారు. రూల్స్‌కు విరుద్దంగా రోడ్లపై బైక్‌లు, కార్లతో స్టంట్స్ చేస్తూ, వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నారు. వీటిపై పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. వాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు.. తరచూ ఎక్కడో అక్కడ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలానే ఒక వ్యక్తి నడిరోడ్డుపై కార్‌తో స్టంట్స్‌ చేస్తూ వాహనదారులను భాయందోళనకు గురిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch Video: తిక్క కుదిరిందిగా.. రోడ్డుపై ప్రమాదకర స్టంట్స్.. కట్‌చేస్తే..
Car Stunt Viral Video
Anand T
|

Updated on: Sep 28, 2025 | 6:45 PM

Share

ఒక వ్యక్తి నడిరోడ్డుపై కార్‌తో స్టంట్స్‌ చేస్తూ వాహనదారులను భయందోళనకు గురిచేసిన ఘటన నోయిడాలోని సెక్టార్-142లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ కావడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు కారు నెంబర్‌ ద్వారా ఆ వ్యక్తిని పట్టుకొని అతడి నుంచి కారును స్వాధీంన చేసుకున్నారు. వైరల్‌ వీడియో ప్రకారం.. సెక్టార్-142 సమీపంలో నిత్యం వాహనదారులతో రద్దీగా ఉండే రోడ్డుపై బ్రేజా కారుతో ఒక యువకుడు ప్రమాదకర స్టంట్స్‌ చేయడం ప్రారంభించాడు. ముందు వెళ్తున్న కారును ఓవర్‌ టేక్ చేస్తూ.. కారుడోర్‌ ఒపెన్‌ చేసి కారును 360 డిగ్రీల తిప్పుటూ ప్రమాదకరంగా స్టంట్స్‌ చేశాడు. దీనితో రోడ్డుపై వెళ్తున్న సదరు వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.

ఇది గమనించిన కొందరు ఈ స్టంట్ వీడియోను రికార్డ్ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ యువకుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ వీడియో వైరల్‌గా మారి పోలీసుల దృష్టికి చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీడియోలోని కార్‌ నెంబర్‌ ఆధారంగా ఆ యువకుడి ఆచూకీ కనిపెట్టారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని.. అతన్నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు. అలానే అతనిపై కారు 35,000 జరిమానా విధించారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!