AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar 2: ‘ధురంధర్ 2’ సినిమాపై సిక్కుల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన మాధవన్.. అసలు ఏం జరిగిందంటే?

'ధురంధర్ 2' బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచింది. కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధిస్తూ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. అయితే ఈ సినిమా కూడా కొన్ని వివాదాల్లో చిక్కుకుంది. ముఖ్యంగా ఆర్. మాధవన్ నటించిన ఒక సన్నివేశంపై సమాజంలోని ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనికి సంబంధించి చిత్ర బృందంపై కేసు కూడా నమోదైంది.

Dhurandhar 2: 'ధురంధర్ 2' సినిమాపై సిక్కుల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన మాధవన్.. అసలు ఏం జరిగిందంటే?
Dhurandhar 2 Movie
Basha Shek
|

Updated on: Mar 25, 2026 | 8:14 AM

Share

రణ్ వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 750 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. రికార్డు వసూళ్లతో వెయ్యి కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. అయితే ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓ వివాదంలో చిక్కుకుంది. సినిమాలో ఒక సన్నివేశంలో సిక్కు మత పవిత్ర గ్రంథంలోని వాక్యాలను అవమానించారనే ఆరోపణలపై చిత్ర కథానాయకుడు రణవీర్ సింగ్, ఆర్. మాధవన్, దర్శకుడు ఆదిత్య ధర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మహారాష్ట్ర సిక్కు సంస్థ అధ్యక్షుడు గుర్జోత్ సింగ్ కీర్ ముంబైలో ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. ఈ చిత్రంలోని ఒక సన్నివేశంలో, గురు గోవింద్ సింగ్ రచించిన పవిత్ర ‘దశమ్ గ్రంథం’లోని శ్లోకాలను పఠిస్తూ నటుడు ఆర్. మాధవన్ సిగరెట్ తాగుతూ కనిపించారు. ఇది సిక్కు సమాజపు మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ‘గురుబానీ కేవలం ఒక సంభాషణ కాదు, అది దైవికమైనది. పవిత్రమైనది. సిగరెట్ తాగుతూ దానిని పఠించడం క్షమించరాని నేరం,’ అని గుర్‌జోత్ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా ఈ విషయంపై చిత్ర బృందం బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే, దర్శకుడు ఆదిత్య ధర్, నటులు రణవీర్ సింగ్, మాధవన్ కనిపించే ప్రతిచోటా నల్ల జెండాలు ప్రదర్శించి నిరసన తెలుపుతామని సిక్కు సంస్థలు హెచ్చరించాయి. దీంతో ఈ వివాదంపై నటుడు ఆర్. మాధవన్ స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో సందేశాన్ని పంచుకుంటూ క్షమాపణలు చెప్పారు. “నేను ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. సినిమాలో శ్లోకం పఠించే ముందు నేను సిగరెట్ తీసుకున్నాను. తెరపై ఎక్కడా కూడా సిగరెట్ తాగుతూ శ్లోకం పఠించే సన్నివేశం లేదు. దర్శకుడు ఆదిత్య ధర్ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. మాకు సిక్కు సమాజం పట్ల అపారమైన గౌరవం ఉంది. నేను సినిమా విడుదలకు ముందు కచ్చితంగా స్వర్ణ దేవాలయాన్ని సందర్శిస్తాను. ఈ పొరపాటు ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు” అని ఆర్. మాధవన్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

క్షమాపణలు చెప్పి న మాధవన్.. వీడియో..

View this post on Instagram

A post shared by R. Madhavan (@actormaddy)

ధురంధర్ 2 సినిమాలో మాధవన్..

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'ధురంధర్ 2' పై సిక్కుల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన మాధవన్.. వీడియో
'ధురంధర్ 2' పై సిక్కుల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన మాధవన్.. వీడియో
RCB: చిన్నస్వామిలో ఆ 11 సీట్లు ఎప్పటికీ ఖాళీగానే..!
RCB: చిన్నస్వామిలో ఆ 11 సీట్లు ఎప్పటికీ ఖాళీగానే..!
బంగారం మార్కెట్‌లో మహాప్రళయం.. 50 ఏళ్ల రికార్డులు బద్ధలు..
బంగారం మార్కెట్‌లో మహాప్రళయం.. 50 ఏళ్ల రికార్డులు బద్ధలు..
టెన్త్, ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు
టెన్త్, ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు
భద్రాచలం టెంపుల్ స్టైల్ ప్రసాదం.. రవ్వ కేసరి ఇంట్లో ఎలా చేయాలంటే
భద్రాచలం టెంపుల్ స్టైల్ ప్రసాదం.. రవ్వ కేసరి ఇంట్లో ఎలా చేయాలంటే
గ్యాసే కాదు.. బ్యాంక్‌ లాకర్లు కూడా దొరకడం లేదు!
గ్యాసే కాదు.. బ్యాంక్‌ లాకర్లు కూడా దొరకడం లేదు!
పనీర్ లేకుండా పాలక్ పనీర్..ఎలా చేయాలో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
పనీర్ లేకుండా పాలక్ పనీర్..ఎలా చేయాలో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన హారర్ క్రైమ్ థ్రిల్లర్
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన హారర్ క్రైమ్ థ్రిల్లర్
హైదరాబాద్‌లో పెట్రోల్‌ బంకుల మూసివేత.. కిలో మీటర్ మేర క్యూ
హైదరాబాద్‌లో పెట్రోల్‌ బంకుల మూసివేత.. కిలో మీటర్ మేర క్యూ
8వ వేతన సంఘం.. జీతం చేతికొచ్చేది ఎప్పుడంటే?
8వ వేతన సంఘం.. జీతం చేతికొచ్చేది ఎప్పుడంటే?