AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Post: నీ లైఫ్ చాలా హార్డ్‌గా ఉందని ఫీలవుతున్నావా.. ఒక్కసారి ఈ స్క్రీన్‌షాట్ చూడు

నీ లైఫ్ మరీ అంత హార్డ్‌గా ఉందా..? చిన్న చిన్న సమస్యల వస్తే కూడా ఓ ఏదో పెద్ద సాగరాన్ని ఈదుతున్నట్లు అనిపిస్తుందా..? ఒక్కసారి ఈ వ్యక్తిని చూడు.. వినపడదు.. మాటలు రావు.. అయినా కుటుంబం కోసం డెలవీర బాయ్‌గా పని చేస్తున్నాడు ..

Viral Post: నీ లైఫ్ చాలా హార్డ్‌గా ఉందని ఫీలవుతున్నావా.. ఒక్కసారి ఈ స్క్రీన్‌షాట్ చూడు
Trending Post
Ram Naramaneni
|

Updated on: Sep 28, 2025 | 3:17 PM

Share

నిజంగా మీ లైఫ్ చాలా దారుణంగా ఉందని భావిస్తున్నారా..? లేనిపోని కష్టాలు అన్నీ మీకే ఉన్నాయని నిరాశ చెందుతున్నారా..? ఒక్కసారి పైన స్క్రీన్ షాట్ చూడండి. అతనికి మాటలు రావు.. మనం చెప్పేది కూడా వినపడదు.. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుగా సాగుతున్నాడు. అలా ఉండి కూడా ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తూ తన కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. అతని స్క్రీన్ షాట్‌ను స్తుతీ అనే యూజర్ నెట్టింట షేర్ చేయడంతో ట్రెండ్ అవుతోంది. లక్షల మంది ఈ పోస్ట్ చూసి స్పందిస్తున్నారు. ఆ ఫుడ్ డెలివరీ బాయ్ ఆత్మస్థైర్యాన్ని అందరూ కొనియాడుతున్నారు. ఫ్యామిలీ కోసం మగవాళ్లు పడే శ్రమ అంటూ ఆమె ఈ పోస్ట్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు.

అందులో ‘నేను మీ ఆర్డర్‌ తీసుకున్నాను. కొద్దిసేపట్లో డెలివరీ చేస్తాను. నాకు వినపడదు, మాట్లాడలేను. అడ్రెస్‌ వద్దకు వచ్చాక మెసేజ్‌ చేస్తాను. దయచేసి చూడండి’ అని ఆ డెలివరీ బాయ్‌ కస్టమర్‌కు మెసేజ్ పంపినట్లు ఉంది. ఈ పోస్ట్‌పై ఓ నెటిజన్ స్పందిస్తూ… ‘మనం పని మానేయడానికి కారణాలు వెతుక్కుంటాం. అతను విధికి ఎదురీదుతున్నాడు. ఇలాంటి వారికి కాస్త టిప్‌ ఇస్తే ఉపయోగపడుతుంది’ అని కామెంట్ చేశారు. ‘ఎదురీత ముందు విధిరాత ఎంతో’ అని మరో యూజర్‌ వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్‌పై మీ అభిప్రయాన్ని కూడా తెలియజేయండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..   

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..