AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : స్కూల్ పిల్లలను మాత్రమే వెంటాడే రాక్షసి.. ఓటీటీలోకి వచ్చిన సరికొత్త హారర్ సినిమా..

ఓటీటీలోకి ఈమధ్య ఎక్కువగా హారర్, సస్పె్న్స్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. హారర్ అడ్వెంచర్ త్రిల్లర్ డ్రామాలను చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మాన్ స్టర్ సమ్మర్ అనే హారర్ సినిమా ఇప్పుడు ఓటీటీ మూవీ లవర్స్ ముందుకు వచ్చింది. హాలీవుడ్ దిగ్గజ నటుడు మెల్ గిబ్సన్ నటించిన ఈ సినిమాలో వేసవిలో స్కూల్ పిల్లలను ఓ రాకాసి వెంటాడుతుంది.

Cinema : స్కూల్ పిల్లలను మాత్రమే వెంటాడే రాక్షసి.. ఓటీటీలోకి వచ్చిన సరికొత్త హారర్ సినిమా..
Monster Summer Movie
Rajitha Chanti
|

Updated on: Mar 25, 2026 | 9:39 AM

Share

నిజానికి హారర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఓవైపు వెన్నులో వణుకుపుట్టించే సీన్స్ ఉన్నప్పటికీ ఈ థ్రిల్లర్ చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. హారర్ సినిమాలకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో స్కూల్ పిల్లలు చూసేలా ఉంటే అడ్వెంచర్ హారర్ మూవీస్ పై పేరెంట్స్ నుంచి స్టూడెంట్స్ వరకు అందరూ కలిసి ఎంజాయ్ చేసే హారర్ చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మీకు చెప్పబోయే ఓ హారర్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా.. ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఆ మూవీ పేరు మాన్ స్టర్ సమ్మర్. ఇది ఒక టీనేజ్ హారర్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామా. ఇది స్కూల్ పిల్లల చుట్టూ సాగే హారర్ అడ్వెంచర్ మిస్టరీ కథ.

ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma: ఆ మహా మనిషికి తలవంచి పాదాభివందనం చేస్తా.. ఆయన గొప్ప వ్యక్తి.. రామ్ గోపాల్ వర్మ..

వేసవిలో స్కూల్ పిల్లలను వెంటాడే ఓ రాకాసి కథ. దానితో పిల్లలు చేసే పోరాటమే ఈ సినిమా. ఆద్యంతం ఆసక్తిగా.. ఊహించని ట్విస్టులతో సాగుతుంది. ఈ సినిమా ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులో ఉంది. హాలీవుడ్ సీనియర్ నటుడు మెల్ గిబ్సన్ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ ఫేమ్ మాసన్ థేమ్స్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ఇది. గతేడాది అక్టోబర్ 4న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. సుమారు తొమ్మిది నెలల తర్వాత ఓటీటీ ప్లాట్ ఫామ్ పారామౌంట్ ప్లస్ విత్ షో టైమ్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇందులో కేవలం అమెరికాలో ఉన్నవారు మాత్రమే చూడగలరు.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : అతడిని నమ్మి చాలా డబ్బు పోగొట్టుకున్నాను.. అందుకు కారణం ఆ ఒక్కటే.. శ్రీకాంత్..

ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. మార్చి 20న ఈ సినిమా ఓటీటీలో విడుదల కాగా.. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని వేసవిలో చిన్నారలు ఎంజాయ్ చేయొచ్చు. కథ విషయానికి వస్తే.. ఒక ఐలాండ్ లో స్కూల్ స్నేహితులంతా వేసవి సెలవులు ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. అయితే అక్కడ ఒక రహస్యమైన అతీంద్రియ శక్తి వారి ఆనందాన్ని ఆవిరి చేస్తుంది. ద్వీపంలోని వారందరినీ ప్రమాదంలోకి నెడుతుంది. అయితే ఆ శక్తితో ఈ స్నేహితులంతా ఎలాంటి పోరాటం చేశారు అనేది సినిమా.

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak: అందరు హీరోలతో చేశా.. కానీ నాగార్జునతో సినిమా ఎందుకు చేయాలేదంటే.. అసలు విషయం చెప్పిన వివి వినాయక్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: కోటి 40 లక్షలు పెట్టి సినిమా తీశా.. అప్పు తీర్చడానికి 6 ఏళ్లు కప్పులు కడిగాను.. టాలీవుడ్ నటుడు..

Follow Us