AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Folk Song: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్నకొత్త ఫోక్ సాంగ్.. ఈ తెలుగు హీరోయిన్ స్టెప్పులకు ఫిదా అవ్వాల్సిందే

ప్రస్తుతం ఫోక్ సాంగ్స్ కు సోషల్ మీడియాలో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే దర్శక నిర్మాతలు కూడా తమ సినిమాల్లో జానపద గేయాలకు చోటు ఇస్తున్నారు. అలా ఇటీవలే రిలీజైన ఓ సినిమాలోని ఫోక్ సాంగ్ యూట్యూట్ తో పాటు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Folk Song: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్నకొత్త ఫోక్ సాంగ్.. ఈ తెలుగు హీరోయిన్ స్టెప్పులకు ఫిదా అవ్వాల్సిందే
Kosindi Koyagura Song
Basha Shek
|

Updated on: Mar 25, 2026 | 10:28 AM

Share

దిగ్గజ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెలుగుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గరివిడి లక్ష్మి పేరుతో తెరకెక్కుతోన్న తెలుగమ్మాయి ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో భారీ చిత్రాలను నిర్మించే సంస్థగా పేరున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలు, గ్లింప్స్ సినిమా అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆ మధ్యన వచ్చిన నల జీలకర్ర మొగ్గ పాట ఎంత వైరలైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఈ పాట వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు దీనికి ఏ మాత్రం తగ్గకుండా గరివిడి లక్ష్మి సినిమా నుంచే మరో కొత్త పాట వచ్చేసింది. ‘కోసింది కొయగూర’ సాంగ్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఆనంది డ్యాన్స్. సినిమాల్లో ఎక్కువగా సైలెంట్ రోల్స్ లో కనిపించే ఈ అమ్మడు ఇప్పుడీ సాంగ్ లో అదరగొట్టింది. చక్కగా చీరకట్టులో ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ చేసింది. హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా స్టెప్పులేసింది. ఈ పాటను చూసిన వారంతా ఆనంది డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు. ఆనందిలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? అని క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ఆనందితో పాటు మరో నటుడు రాగ్ మయూర్ ప్రజెన్స్, డ్యాన్స్ మూమెంట్స్ ఈ ఫోక్ సాంగ్ కు మరింత జోష్ ను అందించాయి.

‘కోసింది కొయగూర’ జానపదం సాంగ్ ను చరణ్ అర్జున్ కంపోజ్ చేశారు. అలాగే అనన్య భట్, షకలక శంకర్, గౌరీ నాయుడు జమ్ము వోకల్స్ ఈ పాటకు మరింత వైబ్ ను తీసుకొచ్చాయి. ఈ పాటకు గంటేడ గౌరు నాయుడు, గౌరీ నాయుడు జమ్ము అందించిన సాహిత్యం అదనపు ఆకర్షణగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఇక గరివిడి లక్ష్మి సినిమా విషయానికి వస్తే.. తన పాటలతో కోట్లాది మంది హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ జానపద గాయని జీవితాన్ని ఈ సినిమా రీక్రియేట్ చేస్తుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఒదిగిపోయిందని మేకర్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమెతో పాటు ఈ సినిమాలో నరేష్, రాశి, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, శరణ్య ప్రదీప్, కుశాలిని తదితరులు వివిధ పాత్రలలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

కోసింది కోయగూర  లిరికల్ వీడియో సాంగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రెడ్‌మీ నుంచి అదిరిపోయే లుక్‌తో కాంప్యాక్ట్‌ ఫోన్‌..
రెడ్‌మీ నుంచి అదిరిపోయే లుక్‌తో కాంప్యాక్ట్‌ ఫోన్‌..
మీ సక్సెస్‌కు అడ్డుగా నిలిచే అతిపెద్ద శత్రువు ఇదే..
మీ సక్సెస్‌కు అడ్డుగా నిలిచే అతిపెద్ద శత్రువు ఇదే..
భర్త ఇంటి నుంచి బయలుదేరగానే భార్యలు చేయకూడని 7 పనులు.. లేదంటే..
భర్త ఇంటి నుంచి బయలుదేరగానే భార్యలు చేయకూడని 7 పనులు.. లేదంటే..
శివసేనలో మరో చీలిక?.. థాకరే క్యాంప్‌లో కలకలం!
శివసేనలో మరో చీలిక?.. థాకరే క్యాంప్‌లో కలకలం!
వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్
వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్
సీబీఎస్సీ 10వ తరగతి సెకండ్‌ బోర్డు ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
సీబీఎస్సీ 10వ తరగతి సెకండ్‌ బోర్డు ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
పీఎఫ్ వడ్డీ అకౌంట్లలోకి ఎప్పుడంటే..? కేంద్రం క్లారిటీ
పీఎఫ్ వడ్డీ అకౌంట్లలోకి ఎప్పుడంటే..? కేంద్రం క్లారిటీ
ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాష్ట్రానికే ఆదర్శం: సీఎం రేవంత్
ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాష్ట్రానికే ఆదర్శం: సీఎం రేవంత్
జగన్నాథుడి విగ్రహాలు ఎందుకు అసంపూర్ణంగా కనిపిస్తాయి? ఆశ్చర్యపరిచే
జగన్నాథుడి విగ్రహాలు ఎందుకు అసంపూర్ణంగా కనిపిస్తాయి? ఆశ్చర్యపరిచే
రాత్రిపూట కళ్ళు అకస్మాత్తుగా తెరుచుకోవడానికి అసలు కారణాలు..
రాత్రిపూట కళ్ళు అకస్మాత్తుగా తెరుచుకోవడానికి అసలు కారణాలు..