మీ ప్రేమకు రుణపడి ఉంటాం: కశ్మీరీల సాయానికి ఇరాన్ కృతజ్ఞతలు
భారత్‌లోని కాశ్మీర్ ప్రాంతంలోని స్థానికులు అనూహ్యంగా ఇరాన్‌కు మద్ధతు తెలుపుతూ విరాళాలు సేకరించారు. ముఖ్యంగా అక్కడి బుద్గామ్, బారాముల్లా జిల్లాల్లోని స్థానికులు పశ్చిమ ఆసియా సంఘర్షణ కారణంగా ఇరాన్ ప్రజలకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈద్-ఉల్-ఫితర్ వేడుకల అనంతరం షియా ప్రాబల్య ప్రాంతాలలోని స్వచ్ఛంద కార్యకర్తలు..

ఇరాన్- అమెరికా- ఇజ్రాయెల్.. మధ్య యుద్ధ వాతావరణం యావత్ ప్రపంచానికి ఆందోళన కలిగిస్తుంది. ఆ క్రమంలో భారత్‌లోని కాశ్మీర్ ప్రాంతంలోని స్థానికులు అనూహ్యంగా ఇరాన్‌కు మద్ధతు తెలుపుతూ విరాళాలు సేకరించారు. ముఖ్యంగా అక్కడి బుద్గామ్, బారాముల్లా జిల్లాల్లోని స్థానికులు పశ్చిమ ఆసియా సంఘర్షణ కారణంగా ఇరాన్ ప్రజలకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈద్-ఉల్-ఫితర్ వేడుకల అనంతరం షియా ప్రాబల్య ప్రాంతాలలోని స్వచ్ఛంద కార్యకర్తలు ఇటీవలి సైనిక దాడుల వల్ల నష్టపోయిన వారికి సహాయం అందించడానికి ఇంటింటికీ వెళ్లి విరాళాలు సేకరించారు. దీంతో అక్కడి స్థానికులు కేవలం డబ్బు మాత్రమే కాకుండా బంగారం, వెండి ఆభరణాలు, పశువులు, ఇంట్లోని విలువైన రాగి, ఇత్తడి వస్తువులను విరాళంగా అందించారు. దీనిపై స్పందించిన భారత్‌లోని ఇరాన్ ఎంబసీ కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. ఇరాన్ ప్రజల కోసం డబ్బు, ఆభరణాలు విరాళంగా ఇచ్చిన భారతీయుల దయ, మానవత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో పంచుకుంది.
‘మానవతా దృక్వదం, హృదయపూర్వక సంఘీభావంతో ఇరాన్ ప్రజలకు అండగా నిలిచిన కాశ్మీర్ ప్రజలకు తాము కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సహాయాన్ని ఎన్నటికీ మరచిపోలేం. థ్యాంక్యూ ఇండియా..’ అని రాయబార కార్యాలయం ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. కాగా కాశ్మీరీలు చేపట్టిన ఈ సహాయక చర్యలో పురుషులు, మహిళలు, పిల్లలతో సహా అక్కడి అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. చాలా మంది మహిళలు తమ వ్యక్తిగత బంగారు ఆభరణాలు, విలువైన గృహోపకరణాలను సైతం విరాళంగా ఇచ్చారు. ఇది వారి భావోద్వేగ అనుబంధాన్ని తెలియజేస్తుంది. ఒక కాశ్మీరీ వితంతువు తన దివంగత భర్త జ్ఞాపకార్థం 28 ఏళ్లుగా భద్రపరిచిన బంగారు జ్ఞాపికను విరాళంగా ఇచ్చింది. మరికొందరు తమ పశువులను కూడా సహాయంగా అందించారు.
we are the nation of Imam Hussain (AS) Labbaik Ya Hussain! Labbaik Ya Khamenei! Hayhat Minna al-Zillah!#Kashmir #IranWar #zadibal pic.twitter.com/dAPbGpycJr
— Tabish abass Pathan 🏴 (@tabish_abass) March 22, 2026
పిల్లలు తమ పిగ్గీ బ్యాంక్‌లను, ఈద్ డబ్బును విరాళంగా ఇచ్చి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. బుద్గాం ఎమ్మెల్యే ముంతాజిర్ మెహదీ సహాయక చర్యల కోసం తన ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తానని అన్నారు. మరికొందరు తమ పశువులను కూడా సహాయంగా అందించారు. ఇజ్రాయెల్, దాని మద్దతుదారులు ఇరాన్‌పై చేసిన ఈ అక్రమ యుద్ధం వల్ల భారీ విధ్వంసం జరిగింది. నాగరిక ప్రపంచం చేయగలిగిన కనీస పని, బాధిత ఇరాన్ ప్రజలకు సహాయం పంపడమేనని ఓ వ్యక్తి మీడియాతో అన్నారు.
we are the nation of Imam Hussain (AS) Labbaik Ya Hussain! Labbaik Ya Khamenei! Hayhat Minna al-Zillah!#Kashmir #IranWar #zadibal pic.twitter.com/dAPbGpycJr
— Tabish abass Pathan 🏴 (@tabish_abass) March 22, 2026
‘ఇరాన్ ప్రజల పట్ల ప్రేమ సంఘీభావంతో నిండిన హృదయంతో విరాళంగా ఇచ్చారు. మీ స్వచ్ఛమైన భావోద్వేగాలు ఇరాన్ ప్రజలకు ఓదార్పుని ఇస్తాయి. దీన్ని ఎప్పటికీ మరచిపోలేం’ అని మరో పోస్ట్‌లో ఇరాన్ ఎంబసీ కృతజ్ఞతలు తెలిపింది. కాగా యుద్ధంతో దెబ్బతిన్న ఇరాన్‌కు మద్దతుగా భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో మార్చి 17న తమ బ్యాంకు ఖాతా వివరాలను పంచుకున్న సంగతి తిలిసిందే. ఇది జరిగిన వారం రోజుల తర్వాత విరాళాలు వెల్లువెత్తడం ప్రారంభమయ్యాయి. సేకరించిన విరాళాలు అవసరమైన వారికి చేరేలా చూస్తామని ఇరాన్ రాయబార కార్యాలయం అధికారులు తెలిపారు. భారత్ – ఇరాన్ దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక, దౌత్య సంబంధాల రిత్య సుదీర్ఘ చరిత్ర ఉంది.
మరిన్న జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




