Telangana: దారుణం.. అప్పు తీర్చలేదనీ వ్యక్తిపై కల్లు సీసాలతో దాడి! వీడియో వైరల్
అప్పు వివాదం చినికి చినికి గాలివానలా మారింది. బాకీ ఉన్న డబ్బుల కోసం ఓ వ్యక్తిపై కల్లు సీసాలతో అమానుషంగా దాడి చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. డబ్బుల కోసమే ఐదుగురు వ్యక్తులు కలిసి ఒకరిపై దాడి చేయడంతో బాధితుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు..

మెదక్, మార్చి 25: పైసా పైసా ఏమిచేస్తావు అంటే.. ఇద్దరు కలిసి మెలసి ఉన్న వారి మధ్య చిచ్చు పెడతా అన్నది అనేది ఓ సామెత. అప్పు వివాదం చినికి చినికి గాలివానలా మారింది. బాకీ ఉన్న డబ్బుల కోసం ఓ వ్యక్తిపై కల్లు సీసాలతో అమానుషంగా దాడి చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. డబ్బుల కోసమే ఐదుగురు వ్యక్తులు కలిసి ఒకరిపై దాడి చేయడంతో బాధితుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..
కలివేముల గ్రామానికి చెందిన మండేలా అనిల్ (35) అనే వ్యక్తి పై దాడి జరిగింది. స్థానిక నివాసితులైన తలారి పండు, అతని భార్య సునీత వద్ద గతంలో లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు అనిల్. అయితే, ఆ అప్పును ఇప్పుడే తీర్చాలంటూ పండు దంపతులు అనిల్ పై ఒత్తిడి తెచ్చారు. తన వద్ద ప్రస్తుతానికి 50 వేల రూపాయలు మాత్రమే ఉన్నాయని, మిగతావి తర్వాత ఇస్తానని అనిల్ ప్రాధేయపడ్డాడు. కానీ, సునీత అనే మహిళ వెనక నుండి కల్లు సీసాతో అనిల్ తలపై బలంగా కొట్టింది. అదే సమయంలో అక్కడే ఉన్న మరో నలుగురు వ్యక్తులు కూడా ఒక్కసారిగా అనిల్ పై విచక్షణారహితంగా దాడికి దిగారు. కాగా అనిల్ కి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అనిల్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




