AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Rules: బ్యాంక్ లాకర్లలో ఎంతవరకు బంగారాన్ని దాచుకోవచ్చు..? బ్యాంకింగ్ నిబంధనలు ఇవే..

ఇంట్లో ఉంటే చోరీకి గురవుతాయనే భయంతో బ్యాంక్ లాకర్లలో బంగారాన్ని భద్రపర్చుకుంటూ ఉంటారు. కానీ బ్యాంక్ లాకర్లలో ఎంత బంగారాన్ని దాచుకోవచ్చు? ఏమైనా పరిమితులు ఉంటాయా..? అనే డౌట్లు చాలామందిలో ఉంటాయి. ఇందుకు ఆర్బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి? అనే విషయాలు చూద్దాం.

Bank Rules: బ్యాంక్ లాకర్లలో ఎంతవరకు బంగారాన్ని దాచుకోవచ్చు..? బ్యాంకింగ్ నిబంధనలు ఇవే..
Bank Lockers
Venkatrao Lella
|

Updated on: Jun 15, 2026 | 9:43 AM

Share

భారతదేశ ప్రజలకు బంగారం అంటే ఎంత మక్కువనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెళ్లి, పంక్షన్లు అనగానే ముందుకు మట్లాడుకునేది బంగారం గురించే. పండుగలు, పంక్షన్ల సమయంలో గోల్డ్ ధరించి మురిసిపోతుంటారు. తమ వద్ద ఇంత బంగారం ఉందని గొప్పగా చెప్పుకుంటారు. అయితే బంగారాన్ని కేవలం ఒక ఆభరణంగానే కాకుండా ఒక ఆస్తిగా దేశ ప్రజలు భావిస్తారు. అందుకే బంగారాన్ని కొని దాచుకుంటారు. ఎమర్జెన్సీగా డబ్బులు అవసరమైనప్పుడు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఇంట్లో లేదా బ్యాంకులో దాచుకుంటారు. బ్యాంకు లాకర్లలో గోల్డ్ భద్రపర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకుగాను కొంత ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని నియమ, నిబంధనలు కూడా ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఉంటాయి. వీటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎంతవరకు దాచుకోవచ్చు..?

రిజర్వు బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం.. బ్యాంక్ లాకర్లలో ఎంత బంగారం దాచిపెట్టుకోవచ్చనే దానిపై ఎలాంటి పరిమితులు లేవు. ఎలాంటి గరిష్ట పరిమితులు ఇందుకు విధించలేదు. దీంతో ఎంత అయినా లాకర్లలో భద్రపర్చుకోవచ్చు. తమ అవసరాలు, లాకర్ల పరిమాణాన్ని బట్టి ఎంత అయినా నిల్వ చేసుకోవచ్చు. బ్యాంకులు ఎలాంటి గరిష్ట పరిమితులు విధించవు. కానీ లాకర్ల పరిమాణం అనేది పరిమితంగా ఉంటుంది. దీంతో దాని సామర్థ్యానికి తగ్గట్లు భద్రపర్చుకోవచ్చు.

ఎలాంటి హక్కులు ఉంటాయి..?

బ్యాంక్ లాకర్లలో బంగారం దాచుకోవడం చాలా భద్రమైనది. మీ బంగారానికి ఏమైనా అయితే బ్యాంక్ బాధ్యత వహిస్తుంది. మీరు దాచుకున్న వస్తువులకు ఏమైనా జరిగితే మీకు పెద్ద మొత్తంలో పరిహారం కూడా అందుతుంది. ఇందుకు ఆర్బీఐ స్పష్టమైన మార్గదర్శకాలు అమలు చేస్తోంది. ఇక మీరు దాచుకున్న వస్తువులకు పూర్తి గోప్యత ఉంటుంది. ఎవరూ చూడటానికి వీలుండదు. కానీ చట్టవిరుద్దమైన కార్యకలాపాలు, చట్టవిరుద్దమైన వస్తువులు ఉన్నాయనే అనుమానం వస్తే బ్యాంకులు జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకానీ లాకర్లలో ఏయే వస్తువులు ఉన్నాయనేది బ్యాంకులు నమోదు చేయవు. అయితే లాకర్ల అద్దెను ఎప్పటికప్పుడు చెల్లిస్తూ ఉండాలి. లాకర్ నియమాల గురించి అవగాహన కలిగి ఉండాలి. మీరు లాకర్లలో దాచుకున్న బంగారానికి సంబంధించి కొనుగోలు పత్రాలను భద్రపర్చుకోవడం కూడా ముఖ్యం. బిల్లులు, రసీదులు, ఇతర సాక్ష్యాలు మీకు ఎప్పుడైనా సహాయపడవచ్చు.

ఇంట్లో ఎంత బంగారం దాచుకోవచ్చు..?

పెళ్లి అయిన స్త్రీ 500 గ్రాముల వరకు, అవివాహిత స్త్రీ 250 గ్రాముల వరకు ఇంట్లో ఉంచుకోవచ్చు. ఇక పురుషుడు 100 గ్రాముల వరకు బంగారం కలిగి ఉండవచ్చు. అంతకంటే ఎక్కువ బంగాం కూడా ఉంచుకోవచ్చు.  కానీ అందుకు సంబంధించిన కొనుగోలు పత్రాలు కలిగి ఉంటే ఎలాంటి సమస్య ఉండదు.

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే