AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరివేపాకు కోద్దామని పెరట్లోకి వెళ్లింది..కళ్లు మూసి తెరిచేంతలో ఆమె

కరివేపాకు కోద్దామని పెరట్లోకి వెళ్లింది..కళ్లు మూసి తెరిచేంతలో ఆమె

Phani CH
|

Updated on: Sep 28, 2025 | 10:08 PM

Share

మరణం ఏ క్షణంలో ఎలా సంభవిస్తుందో చెప్పలేం. పెరట్లోని కరివేపాకు కోసేందుకు వెళ్లి క్షణాల్లో ప్రాణాలు కోల్పోయింది ఓ మహిళ. అప్పటివరకూ కుటుంబంతో సంతోషంగా గడిపిన మహిళ.. కుటుంబ సభ్యుల కోసం వంట చేస్తున్న క్రమంలో అందులో కరివేపాకును వేయాలనుకుంది. ఎంతో ఉత్సాహంగా పెరట్లో తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కరివేపాకు చెట్టు వద్దకు వెళ్లింది.

అదే ఆమెకు చివరి క్షణంగా మారిపోయింది. పాము కాటు రూపంలో మృత్యు ఒడికి చేరింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పెద ఉప్పలంలో గుద్దాటి పార్వతీదేవి కుటుంబంతో కలిసి నివాసముంటోంది. పార్వతికి మొక్కలంటే ఎంతో ఇష్టం. అందుకే పెరట్లో తనకు ఎంతో ఇష్టమైన మొక్కలను పెంచుకుంటోంది. రోజూ వాటికి నీళ్లు పోస్తూ.. వాటితో కొంత సమయం కాలక్షేపం చేస్తుంది. రోజూ మాదిరిగానే మొక్కలతో తన కాలక్షేపం ముగించుకుని వంటచేసేందుకు ఇంట్లోకి వెళ్లింది. వంటచేసే క్రమంలో కరివేపాకు కోసం పెరట్లోని కరవేపాకు చెట్టు దగ్గరకు వెళ్లింది. అక్కడ కరవేపాకును కోస్తుండగా తన కాలుని ఏదో కుట్టినట్టు అనిపించింది. చూసే సరికి పాము పక్కనుంచి పాకుతూ వెళ్ళిపోతూ కనిపించింది. విషయం గ్రహించిన పార్వతి భయంతో అరుపులు, కేకలు వేసింది. దాంతో కుటుంబ సభ్యులు పరుగున అక్కడికి వచ్చారు. అప్పటికే అస్వస్థతకు గురైంది పార్వతి. హుటాహుటిన ఆమెను నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పార్వతి ప్రాణాలు కోల్పోయింది. దీంతో తీవ్ర విషాదంలోకి వెళ్ళిపోయింది పార్వతీదేవి కుటుంబం. అప్పటివరకూ కళ్లముందు తిరిగిన భార్య ఒక్కసారిగా విగతజీవిగా మారడంతో కన్నీరు మున్నీరుగా విలపించాడు పార్వతి భర్త శ్రీనివాసరావు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికాలో భారత విద్యార్థులకు కొత్త టెన్షన్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ రైల్వేలో 8,875 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

సినీ రంగంలోకి హీరో సూర్య కూతురు!

ఐటీ ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త..

పురానాపూల్‌లో నీటమునిగిన శివాలయం.. వరదలో చిక్కుకున్న పూజారి కుటుంబం