నిరుద్యోగులకు గుడ్ న్యూస్ రైల్వేలో 8,875 ఉద్యోగాలకు నోటిఫికేషన్
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. మన దేశంలో ఎక్కువ మంది ఉద్యోగులు పని చేస్తున్న రంగాల్లో ఇండియన్ రైల్వేస్ ఒకటి. అలానే ఏటా ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకునే ప్రభుత్వ రంగ సంస్థ కూడా రైల్వేనే. 2025 సంవత్సరానికి సంబంధించి భారీగా రైల్వే ఉద్యోగాలకు తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ మేరకు షార్ట్ నోటీస్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ కింద దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో మొత్తం 8 వేల 875 రైల్వే పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన వివరణాత్మక సెంట్రలైజ్‌డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనుంది. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ కింద మొత్తం ఖాళీలను భర్తీ చేయడానికి ఆమోదించినట్లు తన ప్రకటనలో పేర్కొంది. మొత్తం పోస్టుల్లో 5వేల 817 గ్రాడ్యుయేట్ లెవెల్, 3వేల 58 పోస్టులు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్‌లో ఉన్నాయి. ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ రిక్రూట్‌మెంట్‌లోని గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల్లో అత్యధికంగా గూడ్స్ రైలు మేనేజర్ పోస్టులు 3వేల 423 వరకు ఉన్నాయి. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్ పోస్టులు 921, స్టేషన్ మాస్టర్ పోస్టులు 615, సీనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్ పోస్టులు 638, చీఫ్ కమర్షియల్-కమ్-టికెట్ సూపర్‌వైజర్ పోస్టులు 161, మెట్రో రైల్వేలో ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులు 59 వరకు ఉన్నాయి. ఇక అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల్లో అత్యధికంగా కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్ పోస్టులు 2 వేల 424 వరకు ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్-కమ్-టైపిస్ట్ పోస్టులు 394, జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్ పోస్టులు 163, రైళ్ల క్లర్క్ పోస్టులు 77 వరకు ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సినీ రంగంలోకి హీరో సూర్య కూతురు!
ఐటీ ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త..
పురానాపూల్‌లో నీటమునిగిన శివాలయం.. వరదలో చిక్కుకున్న పూజారి కుటుంబం
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

