సినీ రంగంలోకి హీరో సూర్య కూతురు!
సూర్య–జ్యోతిక కూతురు దియా 17 ఏళ్ల వయసులో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అదీ హీరోయిన్‌గా కాదు డైరెక్టర్‌గా. కొత్త కాన్సెప్ట్‌ను ఎంచుకుని దియా షార్ట్‌ఫిల్మ్ తీసింది. బాలీవుడ్ మహిళా టెక్నిషియన్ల జీవన ప్రయాణాన్ని షార్ట్ ఫిల్మ్‌గా రూపొందించింది. తన తొలి ప్రాజెక్ట్ సూర్య జోతికల ప్రొడక్షన్ హౌస్ 2డీ ఎంటర్టైన్మెంట్స్పైనే నిర్మించింది.
13 నిమిషాల డాక్యు డ్రామాలో బాలీవుడ్‌లో లైటింగ్ టెక్నీషియన్స్‌గా పనిచేస్తున్న మహిళల కష్టాలు, సవాళ్లు, పట్టుదలని చూపించింది. సాధారణంగా ఆ పనిని మగవారే ఎక్కువగా చేస్తారు. హేటల్ డెద్దియా, ప్రియాంకా సింగ్, లీనా గంగుర్డే అనే ముగ్గురు మహిళాగ్రాఫర్లు ఒత్తిడుల మధ్య తమ కెరీర్‌ను ఎలా మలచుకున్నారన్నదే స్టోరీ. ప్రస్తుతం ఆ డాక్యుమెంటరీ లాస్ ఏంజిల్స్‌లోని రెజెన్సీ థియేటర్‌లో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు ప్రదర్శిస్తున్నారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్‌తో 2026 ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ కేటగిరీకి అర్హత సాధించే అవకాశం ఉంది. తమ కూతురు దియా తీసిన ‘లీడింగ్ లైట్’ సినిమాకు తాము సపోర్ట్ చేస్తున్నందుకు గర్వపడుతున్నామని సూర్య-జ్యోతిక అన్నారు. బాలీవుడ్ మహిళా టెక్నీషియన్ల జీవన ప్రయాణం మీద తీసిన చిత్రాన్ని అందరికీ చేరువ చేయడం సంతోషంగా ఉందన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐటీ ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త..
పురానాపూల్‌లో నీటమునిగిన శివాలయం.. వరదలో చిక్కుకున్న పూజారి కుటుంబం
సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ సినిమాల క్యూ
కమ్ బ్యాక్ కోసం చూస్తున్న డైరెక్టర్స్
Pawan Kalyan’s OG Movie: పవన్ కళ్యాణ్ కెరీర్‌లో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

