Video Viral: ఈ రూట్ లో రైలు ప్రయాణం.. జీవితంలో మర్చిపోలేని అనుభూతినిస్తుంది.. మనసు దోచేస్తున్న దృశ్యాలు
భారతీయ రైల్వేలు (Indian Railways) ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటి. రైలు ప్రయాణం కొందరికి అంతులేని అనుభూతిని మిగుల్చుతుంది. కొండాకోనలు, నదులు, జలపాతాల మధ్య రైలు ప్రయాణించేటప్పుడు ఆ ప్రకృతి...
భారతీయ రైల్వేలు (Indian Railways) ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటి. రైలు ప్రయాణం కొందరికి అంతులేని అనుభూతిని మిగుల్చుతుంది. కొండాకోనలు, నదులు, జలపాతాల మధ్య రైలు ప్రయాణించేటప్పుడు ఆ ప్రకృతి రమణీయ దృశ్యాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. ఈ వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ లో పంచుకుంది. రాజస్థాన్‌లోని దారా ఘాట్‌ల గుండా ప్రయాణిస్తున్న ఓ రైలు వీడియో నెటిజన్ల మనసు దోచుకుంటోంది. 41 సెకన్ల క్లిప్ ప్రకృతి అందాల మధ్య పరిసరాలను దాటుతూ కనిపిస్తుంది. ఈ వీడియో పోస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు 11,000 వ్యూస్ తో పాటు, వందల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. అంతే కాకుండా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. రైల్వేకు అభినందనలు, ఇండియన్ రైల్వేస్ ప్రకృతి అందాలతో మంత్రముగ్ధులను చేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.
Panoramic view of an Express Train traversing through the lush landscape of Dara Ghats in Kota-Nagda Section of @wc_railway. pic.twitter.com/2gRPYvldvA
— Ministry of Railways (@RailMinIndia) July 28, 2022