AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఇంటి లోరూఫ్‌లో అర్ధరాత్రి వింత శబ్ధాలు.. రంగంలోకి రెస్క్యూ టీం.. ఆ తర్వాత సీన్‌ ఊహించలేరు..!

ఇంట్లో వింత శబ్దాలు వినిపిస్తున్నాయని భావించి అత్యవసర సిబ్బందిని పిలిచారు. రెస్క్యూటీం చేపట్టిన ఆపరేషన్ సమయంలో ఓ భయంకరమైన దృశ్యం కనిపించింది.

Viral News: ఇంటి లోరూఫ్‌లో అర్ధరాత్రి వింత శబ్ధాలు.. రంగంలోకి రెస్క్యూ టీం.. ఆ తర్వాత సీన్‌ ఊహించలేరు..!
Snake On House Roof
Jyothi Gadda
|

Updated on: Feb 15, 2023 | 9:14 AM

Share

సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన చాలా వీడియోలను చూస్తుంటాం.. పాముల సయ్యాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. అయితే, ఇక్కడ కనిపించిన దృశ్యం మాత్రం నిజంగా ఒళ్లు జలదరించేలా చేస్తుంది. అంతే కాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూడాలంటే మీలాంటి ధైర్యవంతులు మాత్రమే సరిపొతారు. ఎందుకంటే అంత భయంకరంగా కనిపించాయి పాములు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఒకేసారి మూడు భారీ కొండచిలువలు బయటపడ్డాయి. ఈ వీడియో చూసిన ఎవరికైనా సరే, గుండెల్లో దడపుట్టటం కాయం. ఎందుకంటే ఆ మూడు పైథాన్లు ఒక ఇంటి పైకప్పు నుండి చూస్తుండగానే కిందపడ్డాయి. ఈ ఘటన మలేషియాలో చోటుచేసుకుంది. ఇంట్లో వింత శబ్దాలు వినిపిస్తున్నాయని భావించి అత్యవసర సిబ్బందిని పిలిచారు. ఆపరేషన్ సమయంలో ఓ భయంకరమైన దృశ్యం కనిపించింది.

ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన వీడియో పోస్ట్‌లో, రాత్రి తామంతా నిద్రిస్తున్నప్పుడు తమ ఇంట్లో వింత శబ్దాలు వినిపించాయి. అది ఏమిటో అర్థంకాకపోవటంతో ఇల్లంతా గాలించారు. ఇంటి లోరూఫ్‌ లో ఏదో వింత ఆకారంలో పాములు కనిపించాయి. దాంతో వెంటనే వారు రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. ఆపరేషన్‌ నిర్వహించిన రెస్క్యూ టీంకు మూడు భారీ కొండచిలువలు కనిపించాయి. చాకచక్యంగా భారీ పైథాన్లను బంధించిన సిబ్బంది వాటిని రక్షించి సమీప అడవుల్లో విడిచిపెట్టారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో చూడగలిగినట్టయితే, ఒక పామును దాని తోకతో రక్షించే సమయంలో పైకప్పులో ఒక భాగం పడిపోయింది. ఈసారి అతనికి ఒకటి కాదు రెండు కాదు మూడు భారీ కొండచిలువలు కనిపించాయి. ఒకదానికొకటి అల్లుకుని పైకప్పులో ఇరుక్కుపోయాయి.

ఈ పాములను చూడగానే కుటుంబసభ్యులంతా భయంతో కేకలు వేశారు. కానీ, రెస్క్యూ టీం మాత్రం ధైర్యం చేసి పాము తోకను పట్టుకుని వాటిని కిందకు దించేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో, దీనిని ఇప్పటికే 10 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించారు.

ఈ వీడియో చూసి నివ్వెరపోయిన సోషల్ మీడియా యూజర్లు ఫోటోపై వింత వ్యాఖ్యలు చేశారు.ఇంటి మొత్తానికి నిప్పు పెట్టండి అంటూ ఒకరు రాశారు. మరొకరు, నేను వీటి కారణంగా అంగారక గ్రహానికి వెళ్ళవలసి వచ్చింది అంటూ చెప్పాడు. వామ్మో ఇది నిజమా లేక పీడకలలా ఉందంటూ కామెంట్‌ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..