Health Tips: బరువు తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచే స్పెషల్‌ టీ.. అనేక అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

ఈ పదార్థాలన్నింటినీ బాగా కలపండి. టీ బ్యాగ్‌లను బయటకు తీసేసి రుచిని మరింత పెంచుకోవటం కోసం బ్రౌన్ షుగర్ యాడ్‌ చేసుకోండి.

Health Tips: బరువు తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచే స్పెషల్‌ టీ.. అనేక అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..
Tea
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 15, 2023 | 7:59 AM

చలికాలంలో రెగ్యులర్ టీ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు అందుతాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎక్కువగా చాలామంది అల్లం టీ తాగుతుంటారు. ఇంకా వివిధ రకాల మసాలా టీ తాగుతుంటారు. అయితే, కొబ్బరి టీ గురించి ఎప్పుడైనా విన్నారా..? కొబ్బరి టీ తాగడం వల్ల బరువు తగ్గి, చర్మం, గుండె సమస్యలకు సహాయపడుతుందని మీకు తెలుసా? అవును కొబ్బరి టీ మీ శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొబ్బరి టీ అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. కొబ్బరి టీ వల్ల కలిగే ప్రయోజనాలను మీరు తప్పక తెలుసుకోవాలి, అయితే శీతాకాలంలో కొబ్బరి టీ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దాని ప్రయోజనాలను తెలుసుకుందాం.

శీతాకాలంలో శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, గుండె జబ్బుల వంటి సమస్యలలో ప్రయోజనకరంగా ఉంటుంది. తరచుగా వ్యాధులకు గురయ్యే వ్యక్తులు దీనిని ఉపయోగించవచ్చు. ఈ టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి త్వరగా పెరుగుతుంది. కొబ్బరి టీలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ప్రజల ఆహారపు అలవాట్లు చాలా చెడిపోయాయి. దీంతో గుండె జబ్బుల వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. కొబ్బరి టీ HDL కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి, చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.. కొబ్బరి టీలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే కొబ్బరి టీ తాగడం వల్ల బరువు తగ్గుతారు. మీరు కూడా బరువు అదుపులో ఉంచుకోవాలనుకుంటే.. ఈ టీని రోజూ తాగండి. అంతేకాకుండా కొబ్బరి టీలో కొవ్వు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నందున చర్మానికి చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. దీంతో చర్మ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

ఇవి కూడా చదవండి

కొబ్బరి టీ తయారు చేయడం ఎలా.. కొబ్బరి టీ తయారీకి కావలసినవి: 3 కప్పుల నీరు, 1 కప్పు కొబ్బరి పాలు, 1/2 కప్పు హెవీ క్రీమ్, 2 బ్యాగ్‌ల గ్రీన్ టీ, 1 టీస్పూన్ బ్రౌన్ షుగర్. ఈ టీ సిద్ధం చేయడానికి ఒక గిన్నెలో నీటిని మరిగించండి. అందులో గ్రీన్ టీ బ్యాగ్స్ వేయండి. దానికి కొబ్బరి పాలు వేసి హెవీ క్రీమ్‌ కలపాలి. ఈ పదార్థాలన్నింటినీ బాగా కలపండి. టీ బ్యాగ్‌లను బయటకు తీసేసి రుచిని మరింత పెంచుకోవటం కోసం బ్రౌన్ షుగర్ యాడ్‌ చేసుకోండి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న
అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న
నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్
నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్
నేనేం భయపడట్లే.. ఇప్పుడు నాకు కుదరదు.! RGV వీడియో.
నేనేం భయపడట్లే.. ఇప్పుడు నాకు కుదరదు.! RGV వీడియో.
కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌పై సమంత రియాక్షన్.! వీడియో..
కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌పై సమంత రియాక్షన్.! వీడియో..
పెళ్లిలో పాత సంప్రదాయాన్ని పాటించేందుకు నాగ చైతన్య నిర్ణయం.!
పెళ్లిలో పాత సంప్రదాయాన్ని పాటించేందుకు నాగ చైతన్య నిర్ణయం.!
హనుమాన్ హీరో తేజ సజ్జ కు పెద్దాయన పాదాభివందనం.! వీడియో వైరల్..
హనుమాన్ హీరో తేజ సజ్జ కు పెద్దాయన పాదాభివందనం.! వీడియో వైరల్..
పుష్ప2 నటుడు శ్రీ తేజ్‌పై కేసునమోదు! పెళ్లి చేసుకుంటానని నమ్మించి
పుష్ప2 నటుడు శ్రీ తేజ్‌పై కేసునమోదు! పెళ్లి చేసుకుంటానని నమ్మించి
రెహ్మాన్‌తో రిలేషన్ పై ఎట్టకేలకు నోరు విప్పిన మోహిని.! వీడియో..
రెహ్మాన్‌తో రిలేషన్ పై ఎట్టకేలకు నోరు విప్పిన మోహిని.! వీడియో..
అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ అమ్మాయి ఈమే.!
అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ అమ్మాయి ఈమే.!
అయ్యో.! పొలం పనులు చేస్తుండగా ఊహించని సీన్..
అయ్యో.! పొలం పనులు చేస్తుండగా ఊహించని సీన్..