AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Girl body found in fridge: ఢిల్లీలో మరో శ్రద్ధా కేసు..? ప్రేమించిన యువతిని చంపి దాబా ఫ్రిజ్‌లో దాచిన యువకుడు

ఈ కేసు కూడా శ్రద్ధా వాకర్ హత్య కేసును పోలి ఉంటుంది. అక్కడ, 27 ఏళ్ల మహిళను ఆమె లైవ్-ఇన్ భాగస్వామి ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి 300 లీటర్ల రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచి ఆ భాగాలను ఢిల్లీ అడవుల్లో పడేశాడు.

Girl body found in fridge: ఢిల్లీలో మరో శ్రద్ధా కేసు..? ప్రేమించిన యువతిని చంపి దాబా ఫ్రిజ్‌లో దాచిన యువకుడు
Girl Body Found In Fridge
Jyothi Gadda
|

Updated on: Feb 15, 2023 | 8:31 AM

Share

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. నైరుతి ఢిల్లీ నజాఫ్‌గఢ్‌లోని మిత్రన్ గ్రామ శివార్లలో తాను డేటింగ్ చేస్తున్న యువతిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ఫ్రిజ్‌లో భద్రపరిచాడనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. కాశ్మీరీ గేట్ ISBT సమీపంలో యువతిని గొంతు కోసి చంపినట్టుగా పోలీసులు చెప్పారు.. ఘటనకు పాల్పడిన నిందితుడిని సాహిల్ గెహ్లాట్ (26)గా గుర్తించారు. మిత్రన్ గ్రామ శివార్లలోని తన దాబాలోని ఫ్రిజ్‌లో మృతదేహాన్ని దాచిపెట్టినట్లు సమాచారం. మంగళవారం పోలీసులు సెర్చ్‌ ఆపరేషన్‌ చేసి దాబాలోని ఫ్రిజ్‌ నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు.

హత్యకు గురైన యువతికి, సాహిల్‌కు పరస్పర బంధుత్వాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే నిందితుడు సాహిల్ తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించినందుకు కోపంతో ఆమెను హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం సాహిల్, నిక్కీ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మిత్రాన్ గ్రామానికి చెందిన సాహిల్, హర్యానాలోని ఝజ్జర్ నివాసి నిక్కీని 2018లో ఉత్తమ్ నగర్ ప్రాంతంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో కలిశాడు. తర్వాత గ్రేటర్ నోయిడాలోని అదే కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. ఈ జంట గ్రేటర్ నోయిడాలో అద్దె ఇంట్లో కలిసి జీవించడం ప్రారంభించారు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో వారు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత వారు మళ్లీ ద్వారకా ప్రాంతంలోని అద్దె ఇంట్లో కలిసి జీవించడం ప్రారంభించినట్టుగా వివరించారు.

ఇవి కూడా చదవండి

ఈ కేసు కూడా శ్రద్ధా వాకర్ హత్య కేసును పోలి ఉంటుంది. అక్కడ, 27 ఏళ్ల మహిళను ఆమె లైవ్-ఇన్ భాగస్వామి ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి 300 లీటర్ల రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచి ఆ భాగాలను ఢిల్లీ అడవుల్లో పడేశాడు. శ్రద్ధా హత్య కేసులో ఢిల్లీ పోలీసులు 6,636 పేజీల చార్జిషీటును దాఖలు చేశారు. కేసు నమోదైన 75 రోజుల్లోనే చార్జిషీటు దాఖలు చేశారు.

గత ఏడాది నవంబర్ 12న అఫ్తాబ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు, ఆ తర్వాత శ్రద్ధా వాకర్ హత్యకు సంబంధించిన భయంకరమైన వివరాలు దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. శ్రద్ధా వాకర్ ఎముకలకు సంబంధించిన పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె శరీరాన్ని రంపపులాంటి వస్తువుతో 35 ముక్కలుగా నరికినట్లు తేలింది.దక్షిణ ఢిల్లీ అడవుల్లో 13 కుళ్లిపోయిన శరీర భాగాలు, ఎక్కువగా ఎముకల శకలాలు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..