Viral Video: వింత దొంగ కష్టాలు.. పాక్కుంటూ వెళ్లాడు.. అడ్డంగా చిక్కాడు.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు!
దొంగల్లో పలు రకాల దొంగలను మనం చూస్తుంటాం.. కొందరు నగలు చోరీ చేస్తే, కొందరు నగదు చోరీ చేస్తారు.. మరికొందరు వాహనాలు..

దొంగతనానికి వచ్చిన దొంగలు ఇరుక్కుపోవడం మనం సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలం తరచూ జరుగుతున్నాయి. చోరీ చేయడానికి వచ్చి కొందరు దొంగలు అడ్డంగా బుక్కవుతున్నారు. తాజాగా ఇక్కడొక వింత దొంగ.. దొంగతనానికి పాల్పడుతూ దొరికిపోయాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దొంగల్లో పలు రకాల దొంగలు ఉంటారు. కొందరు వస్తువులు దొంగలిస్తే.. మరికొందరు వాహనాలను ఎత్తుకెళ్ళిపోతారు. అయితే ఈ వింత దొంగ మాత్రం కరెంట్‌ను దొంగలిస్తాడు. పాపం విద్యుత్ చౌర్యానికి పాల్పడుతూ.. అధికారుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కరెంట్ మెయిన్ లైన్ నుంచి దొంగతనంగా ఇంటికి వైర్ లాక్కున్నాడు. రోజంతా అక్రమంగా విద్యుత్ వినియోగించుకుంటూ బిల్లు లేకుండా రాజభోగం అనుభవించేవాడు. విద్యుత్ అధికారులు పర్యవేక్షణకు వచ్చినప్పుడు కరెంట్ వైర్లను కట్ చేస్తుండేవాడు.
అయితే దొంగతనం ఎప్పటికైనా బయటపడక మానదు కదా… అదే జరిగింది.. ఇతగాడి విద్యుత్ చౌర్యంపై ఎవరో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇంకేముంది.. ఫిర్యాదు అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు విచారించడానికి అక్కడికి వెళ్లారు. దీంతో అప్రమత్తమైన ఆ దొంగ ఇంటికి లోపల గడియపెట్టేసి బాల్కనీపైకి మెల్లగా పాకుతూ వెళ్లి అక్కడున్న లింక్ వైర్‌ను కట్ చేయబోయాడు. అయితే అప్పటికే ఓ అధికారి టెర్రస్ మీదకు వెళ్లి వీడియో తీస్తున్నాడు.
టెర్రస్ మీద ఉన్న మెట్లపై ఇటుక రాళ్లతో కప్పి ఉన్న జాయింట్ వైర్లు కట్ చేస్తున్న క్రమంలో ఈ వింత దొంగ అధికారికి చిక్కాడు. ‘తమ్ముడు నేనిక్కడే ఉన్నా’ అని ఆ అధికారి మాట విన్న ఆ కరెంట్ దొంగ ఎక్స్‌ప్రెషన్ చూడాల్సిందే.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read:
గోడ నుంచి వింత శబ్దాలు.. తీరా చూసి ఖంగుతిన్న అధికారులు.!
ఈ ఫోటోలో పిల్లి దాగుంది.. దాన్ని గుర్తించడం చాలా కష్టం.. మీరు కనిపెట్టగలరా.?
వరల్డ్ స్నేక్ డే రోజు.. శ్రీవారి భక్తులకు భారీ నాగుపాము షాక్..!
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి తేదీ ఖరారు..