Viral Video: క్లాస్‌రూమ్‌లో గుర్రుపెట్టిన టీచర్ .. చెమటలు పట్టకుండా విసనకర్రతో విసురుతూ నిద్ర బుచ్చిన చిన్నారులు
స్కూల్ టైమ్‌లో క్లాసులు చెప్పాలసిన టీచర్ ఇలా హాయిగా నిద్రపోతోంది. క్లాస్ రూమ్‌లో ఫ్యాన్ లేకపోవడంతో పిల్లల చేతికి కొన్ని సన్నని బుక్స్, అట్టలు వంటివి ఇచ్చి గాలి విసరమని చెప్పింది... ఇక ఆమె ప్రశాంతంగా పడుకుంది. ఆ చిన్న పిల్లలు టీచర్ చుట్టూ చేరి గాలి విసురుతున్న దృశ్యం వీడియోలో చిక్కింది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై విచారణకు ఆదేశించామని, ఉపాధ్యాయురాలిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. వారికి అత్యుత్తమ విద్యను అందించి, వారి భవిష్యత్తును చక్కదిద్దడం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది. అయితే చాలా సార్లు ఇలాంటి టీచర్ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటివి చూసిన ప్రజలు ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా మరో టీచర్ నిర్వాకం నెటిజన్లను షాక్ అయ్యేలా చేస్తుంది. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఓ పంతులమ్మ క్లాస్ రూమ్‌లోనే హాయిగా గుర్రుపెట్టి నిద్రపోతుండగా ఎవరో వీడియో తీసి వైరల్ చేశారు. పైగా సదరు టీచర్ నిద్రపోతుండగా, చిన్నారులు చుట్టూ చేరి ఆమెకు గాలి విసురుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లోని ఓ పాఠశాల తరగతి గదిలో గాఢనిద్రలోకి జారుకున్న టీచర్‌కు చిన్నారులు గాలివిసురుతున్న దృశ్యం కనిపించింది. ఇలాంటి దారుణ సంఘటన కెమెరాలో చిక్కుకోగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. క్లాస్ రూమ్‌లో టీచర్ చేసిన పనికి పిల్లల తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. ఆ టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్కూల్ యాజమాన్యాన్ని పట్టుబట్టారు.
#Aligarh-जब शिक्षक ही ऐसे होंगे तो शिक्षण कैसा होगा,भयंकर गर्मी से निजात पाने को मासूमों से हवा कराती मास्टरनी साहिबा,वीडियो धनीपुर ब्लॉक के गोकुलपुर गांव का बताया जा रहा हैं,@bsaaligarh @Dm_Aligarh @thisissanjubjp @BJP4UP pic.twitter.com/EO22ZBwpEe
— Vishu Raghav ( Tv journalist ) (@Vishuraghav9) July 26, 2024
అలీఘర్‌లోని ధానీపూర్ బ్లాక్‌లోని గోకుల్‌పురా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూల్ టైమ్‌లో క్లాసులు చెప్పాలసిన టీచర్ ఇలా హాయిగా నిద్రపోతోంది. క్లాస్ రూమ్‌లో ఫ్యాన్ లేకపోవడంతో పిల్లల చేతికి కొన్ని సన్నని బుక్స్, అట్టలు వంటివి ఇచ్చి గాలి విసరమని చెప్పింది… ఇక ఆమె ప్రశాంతంగా పడుకుంది. ఆ చిన్న పిల్లలు టీచర్ చుట్టూ చేరి గాలి విసురుతున్న దృశ్యం వీడియోలో చిక్కింది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై విచారణకు ఆదేశించామని, ఉపాధ్యాయురాలిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..