AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూమి కంపిస్తున్న వేళ అప్పుడే పుట్టిన శిశువుల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన కాపాడిన నర్సులు..

తైవాన్‌లో భూకంపం సంభవించి.. భారీ నష్టాన్ని మిగిల్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. ఈ భూకంపం చాలా బలంగా ఉంది. చాలా ఆకాశహర్మ్యాలు కూలిపోయాయి. జపాన్‌లోని రెండు దీవులను కూడా సునామీ తాకింది. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భూకంపం ఏర్పడిన సమయంలో ఆసుపత్రిలో పనిచేసే నర్సులు త్వర త్వరగా పుట్టిన పిల్లలను ఉంచిన గదికి వచ్చినట్లు ఈ వీడియోలో చూపిస్తోంది.

భూమి కంపిస్తున్న వేళ అప్పుడే పుట్టిన శిశువుల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన కాపాడిన నర్సులు..
Taiwanese Nurses Protecting BabiesImage Credit source: Twitter/@IamNishantSh
Surya Kala
|

Updated on: Apr 05, 2024 | 11:49 AM

Share

ఇటీవలి కాలంలో ప్రపంచంలోని అనేక దేశాల్లో భూమి కంపిస్తున్న సంఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. చిన్నపాటి భూకంపాల వల్ల పెద్దగా తేడా కనిపించకపోయినా బలమైన భూకంపం వస్తే మాత్రం నగరం మొత్తం నాశనమైపోతుంది. నిన్న (బుధవారం) తైవాన్‌లో భూకంపం సంభవించి.. భారీ నష్టాన్ని మిగిల్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. ఈ భూకంపం చాలా బలంగా ఉంది. చాలా ఆకాశహర్మ్యాలు కూలిపోయాయి. జపాన్‌లోని రెండు దీవులను కూడా సునామీ తాకింది. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భూకంపం ఏర్పడిన సమయంలో ఆసుపత్రిలో పనిచేసే నర్సులు త్వర త్వరగా పుట్టిన పిల్లలను ఉంచిన గదికి వచ్చినట్లు ఈ వీడియోలో చూపిస్తోంది. ప్రాణాలతో చెలగాటమాడకుండా.. పిల్లలకు హాని కలగకుండా సెల్ ఫోన్ ని ఒకరు పట్టుకున్నారు. అయితే ఆసుపత్రి గదిలో అప్పటికే ముగ్గురు నర్సులు ఉన్నారు.. వారు పిల్లలను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. భూకంపం సంభవించిన వెంటనే మరొక నర్సు వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి.. తాను కూడా ఇతర నర్సులతో కలిసి పిల్లలను రక్షించడానికి సహాయం చేయడం ప్రారంభించినట్లు వీడియోలో మీరు చూడవచ్చు. తమ ప్రాణాలను సైతం పట్టించుకోకుండా పిల్లలను కాపాడటం మొదలుపెట్టిన నర్సుల ధైర్యం అమోఘం.

ఇవి కూడా చదవండి

ఈ హృదయాన్ని హత్తుకునే వీడియో @IamNishantSh అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయబడింది. ‘భూకంపం సమయంలో పిల్లలను రక్షించే తైవాన్ నర్సులు. ఈ రోజు నేను ఇంటర్నెట్‌లో చూసిన చాలా అందమైన వీడియోలలో ఇది ఒకటి. ఈ వీర మహిళలకు వందనం.

కేవలం 31 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షా 40 వేల మందికి పైగా వీక్షించగా, రెండు వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి రకరకాల రియాక్షన్స్ ఇచ్చారు. వినియోగదారులు నర్సులపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఇలాంటి దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తాయని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..