AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shanthi Swaroop: తెలుగు తొలి తరం న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇక లేరు.. సంతాపం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

1983 న‌వంబ‌ర్ 14న దూరద‌ర్శ‌న్ చానెల్‌లో మొదటి సారిగా శాంతి స్వ‌రూప్ తెలుగులో వార్తలు చదవడం మొదలు పెట్టి.. దాదాపు పదేళ్ల పాటు ఎటువంటి టెలీప్రాంప్ట‌ర్ లేకుండా స్పష్టంగా తెలుగులో వార్తలు చదివి వినిపించారు. న్యూస్ రీడ‌ర్‌గా చెర‌గ‌ని బుల్లి తెరపై చెరగని ముద్ర వేశారు. ఇంకా చెప్పాలంటే శాంతి స్వరూప్ పేరుని అప్పటి తరం నేటికీ గుర్తు చేసుకుంటారు. 2011లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. అప్పటి వరకూ వార్తలు చదువుతూనే ఉన్నారు.

Shanthi Swaroop: తెలుగు తొలి తరం న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇక లేరు.. సంతాపం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
Shanti Swaroop Passed Away
Surya Kala
|

Updated on: Apr 05, 2024 | 1:50 PM

Share

తెలుగు తొలి న్యూస్ రీడ‌ర్ శాంతి స్వ‌రూప్ మరణించారు. రెండు రోజుల క్రితం గుండె నొప్పితో హైద‌రాబాద్ య‌శోదా ఆస్ప‌త్రిలో జాయిన్ అయ్యారు. చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచిన‌ట్లు శాంతి స్వరూప్ కుటుంబ సభ్యులు తెలిపారు.  శాంతిస్వ‌రూప్ మృతితో ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు, జ‌ర్న‌లిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  ఆయ‌న ఫ్యామిలీ సభ్యులకు తమ సానుభూతిని తెలిపారు. ఆయనకు  భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఆయన తెలుగులో వార్తలు చదివే సమయంలో ఎటువంటి టెలీప్రాంప్టర్‌ ఉండేది కాదు. కేవలం పేపర్ మీద రాసి ఉన్న వార్తలు చదివి వినిపించేవారు. 1983 న‌వంబ‌ర్ 14న దూరద‌ర్శ‌న్ చానెల్‌లో మొదటి సారిగా శాంతి స్వ‌రూప్ తెలుగులో వార్తలు చదవడం మొదలు పెట్టి.. దాదాపు పదేళ్ల పాటు ఎటువంటి టెలీప్రాంప్ట‌ర్ లేకుండా స్పష్టంగా తెలుగులో వార్తలు చదివి వినిపించారు. న్యూస్ రీడ‌ర్‌గా చెర‌గ‌ని బుల్లి తెరపై చెరగని ముద్ర వేశారు. ఇంకా చెప్పాలంటే శాంతి స్వరూప్ పేరుని అప్పటి తరం నేటికీ గుర్తు చేసుకుంటారు. 2011లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. అప్పటి వరకూ వార్తలు చదువుతూనే ఉన్నారు. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును శాంతి స్వరూప్ అందుకుంటారు. శాంతి స్వరూప్ మృతితో తెలుగు వార్తా ప్రసార రంగంలో ఒక శకం ముగిసినట్లు అయింది. లెజెండరీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్‌ను కోల్పోయినట్లు తెలుగు వార్తా ప్రసార ప్రపంచం సంతాపం వ్యక్తం చేసింది. స్వరూప్ మరణం తెలుగు మీడియాకు మాత్రమే కాదు అందరికీ తీరని లోటు అని చెప్పారు.

సంతాపం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

తొలి తెలుగు న్యూస్ రీడర్‌ శాంతి స్వరూప్‌ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. తెలుగు వార్తలు చదివిన తొలి తరం న్యూస్‌ రీడర్‌గా శాంతి స్వరూప్‌ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులు. 1983 నుంచి 2011లో పదవీ విరమణ చేసేంత వరకు సుదీర్ఘ కాలం పాటు ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. శాంతి స్వరూప్ తెలుగు మీడియా రంగంలో చిరస్మరణీయమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. శాంతి స్వరూప్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని  ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!