మైహోమ్ ఇండస్ట్రీస్‌లో శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి తిరు కళ్యాణం.. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందజేసిన రామేశ్వరావు కుమారి దంపతులు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు స్వామివారి తిరు కళ్యాణం జరిగింది. అర్చకులు, వేద పండితులు ఉత్సవ మూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవను జరిపారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను తీసుకొచ్చి కల్యాణ తంతు చేపట్టారు. లక్ష్మీ సమేతుడైన వేంకటేశ్వరుడుని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరు కల్యాణ నిర్వహించారు. ముళ్లోకాది దేవతలు చూస్తుండగా స్వామి వారు శ్రీ, భూదేవి మెడలో మంగళ సూత్రధారణ చేశారు.
సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని మైహోమ్ ఇండస్ట్రీస్‌లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి 26వ కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవాన్ని చూసి భక్తులు పునీతులయ్యారు. స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా వేద పండితుల మంత్రోచ్ఛారణలు, వేదపారాయణాలు, మంగళ వాయిద్యాల మధ్య జరిగింది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు స్వామివారి తిరు కళ్యాణం జరిగింది. అర్చకులు, వేద పండితులు ఉత్సవ మూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవను జరిపారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను తీసుకొచ్చి కల్యాణ తంతు చేపట్టారు. లక్ష్మీ సమేతుడైన వేంకటేశ్వరుడుని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరు కల్యాణ నిర్వహించారు. ముళ్లోకాది దేవతలు చూస్తుండగా స్వామి వారు శ్రీ, భూదేవి మెడలో మంగళ సూత్రధారణ చేశారు.
ఆలయ తిరువీధుల ప్రాంగణం నమో వెంకటేష్, గోవిందా నామస్మరణతో మార్మోగింది. స్వామి అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు తమ జన్మ ధన్యమైందని భావిస్తూ ఆనంద పరవశులయ్యారు. సమస్త దేవతలు, మహర్షులు, ప్రకృతిలోని ప్రాణకోటి మొత్తం ఈ కల్యాణ వేడుకను తనివితీరా వీక్షించి పరవశించారన్నారు ఆహోబిలం పీఠాధిపతి రామానుజాచార్య.
స్వామి అమ్మవార్ల కళ్యాణ తంతును శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి భక్తులకు ప్రవచించారు. లోక కల్యాణం, జగత్ రక్షణ కోసం జరిగిన ఈ కల్యాణికి ముందుగా గజవాహన సేవపై ఆలయ తిరువీధుల్లో ఉరేగించారు. స్వామివారి తిరు కల్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను మై హోమ్ ఇండస్ట్రీస్ చైర్మన్ జూపల్లి రామేశ్వరావు ,కుమారి దంపతులు అందజేశారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..