Apple Benefits: యాపిల్‌లో పోషకాలు మెండు.. ఈ పండును రోజులో ఏ సమయంలో తినాలో తెలుసా?
రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్లకి దూరంగా ఉన్నట్టే అని అంటారు. దీనిని తినడం వలన పేగులను ఆరోగ్యంగా ఉంచే బ్యాక్టీరియా పెరుగుతుంది. అంతేకాదు కొన్ని రకాల కొవ్వు ఆమ్లాల ఉత్పత్తిలో సాయం చేస్తుంది. ఆపిల్ లేని హోమ్ డైనింగ్ టేబుల్స్ అసంపూర్ణంగా ఉంటాయి. అయితే రోజు ఆపిల్ తినడం ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
Updated on: Apr 05, 2024 | 11:14 AM

యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది.

యాపిల్‌లో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో యాపిల్స్ బాగా ఉపయోగపడతాయి.

యాపిల్ బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. శరీరంలో ఎలాంటి వాపునైనా తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉంచడంలో ఈ పండు ఉపయోగపడుతుంది.

అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం, వ్యాయామం లేకపోవడం, అధిక బరువు-ఇవన్నీ టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తాయి. చిన్నప్పటి నుంచి క్యాలరీలు, షుగర్, ఫ్యాట్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే మధుమేహాన్ని ఏ విధంగానూ అరికట్టలేరు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో వైఫల్యం చెందితే పిల్లలకు హాని కలుగుతుంది. అయితే యాపిల్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. ఈ పండులో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి టైప్-2 డయాబెటిస్‌ను నివారించగలవు. పిల్లల్లో మలబద్దకాన్ని తొలగించడంలో కూడా యాపిల్స్ సహకరిస్తాయి.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయం సమయంలో ఆపిల్ తినడం శరీరానికి మంచిది. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత యాపిల్ తింటే మేలు జరుగుతుందని చాలా మంది అనుకుంటారు

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే సమస్యలను తొలగిస్తాయి. అనేక దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి ఇది సహాయపడుతుంది. అలాగే యాపిల్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.

తక్కువ కేలరీల కంటెంట్ ఉన్న పండ్లలో యాపిల్ ఒకటి. ఒక యాపిల్ పండులో 60 కేలరీలు మాత్రమే ఉంటాయి. షుగర్ లెవల్స్ కూడా పెరగవు. యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఉండే క్వెర్సెటిన్ అనే పదార్ధం చర్మానికి మేలు చేస్తుంది.




