AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : స్కూల్‌ “ఫెర్‌వెల్‌పార్టీ”లో అదిరిపోయే సీన్.. హీరో లెవల్‌లో ఎంట్రీ ఇచ్చిన స్టూడెంట్.. వైరలవుతున్న వీడియో

సెయింట్ మేరీస్ కాన్వెంట్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీ ఏర్పాటు చేశారు. ఇందుకోసం విద్యార్థులంతా ఒక్కొక్కరుగా పాఠశాలకు చేరుకుంటున్నారు. అయితే ఓ విద్యార్థిని ఎంట్రీ అందరినీ అదరగొట్టేసింది. ఒక్కసారి వీడియోలో ఈ సీన్ చూసిన తర్వాత మీకు కూడా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది.. ఎందుకంటే ఈ స్టూడెంట్ ఎంట్రీని బాగా తీశాడు.

Viral Video : స్కూల్‌ ఫెర్‌వెల్‌పార్టీలో అదిరిపోయే సీన్.. హీరో లెవల్‌లో ఎంట్రీ ఇచ్చిన స్టూడెంట్.. వైరలవుతున్న వీడియో
School Farewell Party Viral
Jyothi Gadda
|

Updated on: Feb 19, 2024 | 8:12 PM

Share

పాఠశాల అనేది ప్రతి విద్యార్థి జీవితంలో అత్యంత ముఖ్యమైన, అందమైన సమయం. ఆ 10 సంవత్సరాల పాఠశాల చదువులు చాలా త్వరగా గడిచిపోతాయి. ఇక్కడ కూడా ఓ టెన్త్‌ బ్యాచ్‌కు 10వ తరగతి పూర్తై.. ఆ స్కూల్‌కి వీడ్కోలు చెప్పే సమయం వచ్చింది. ఇందుకోసం స్కూల్లో ఫేర్‌వెల్‌ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చివరిసారిగా పాఠశాలలో ఒకరినొకరు కలుసుకుని స్కూల్‌ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సంతోషంగా వీడ్కోలు పలికారు. ఈ సమయంలో కొంతమంది విద్యార్థులు స్కూల్‌ ఫెర్‌వెల్‌ పార్టీని స్పెషల్‌గా చేయాలనుకున్నారు. అందుకోసం ఎవరూ కలలో కూడా ఊహించని విధంగా ఒక విద్యార్థి ఈ వీడ్కోలు పార్టీలో హల్‌చల్‌ చేశాడు. ఫెర్‌వెల్‌ పార్టీ సందర్భంగా ఓ విద్యార్థి హెలికాప్టర్‌లో పాఠశాలలోకి ప్రవేశించాడు. అతని ఎంట్రీ చూసి ఇతర విద్యార్థులు నోరెళ్లబెట్టారు. రాజస్థాన్‌లోని ఓ కాన్వెంట్ స్కూల్‌లో జరిగింది ఈ ఘటన.

స్కూల్‌ ఫెర్‌వెల్‌ పార్టీలో హెలికాప్టర్ ఎంట్రీ..

ఇవి కూడా చదవండి

రాజస్థాన్‌లోని జైపూర్‌లోని సెయింట్ మేరీస్ కాన్వెంట్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీ ఏర్పాటు చేశారు. ఇందుకోసం విద్యార్థులంతా ఒక్కొక్కరుగా పాఠశాలకు చేరుకుంటున్నారు. అయితే ఓ విద్యార్థిని ఎంట్రీ అందరినీ అదరగొట్టేసింది. ఎందుకంటే.. ఆ విద్యార్థి ఖరీదైన కారు, బైక్‌పైనో రాలేదు..ఏకంగా హెలికాప్టర్‌లో ఎగురుకుంటూ పాఠశాలకు చేరుకున్నాడు. అతని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో హెలికాప్టర్‌లో వచ్చిన స్టూడెంట్‌ని చూస్తారు. అతని హెలికాప్టర్ పాఠశాల మైదానంలో దిగడం అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. ఒక్కసారి వీడియోలో ఈ సీన్ చూసిన తర్వాత మీకు కూడా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది.. ఎందుకంటే ఈ స్టూడెంట్ ఎంట్రీని బాగా తీశాడు. అదే సమయంలో పలువురు విద్యార్థులు విలాసవంతమైన వాహనాల్లో వస్తున్నారు. సెలబ్రిటీలు వస్తున్న రేంజ్‌లో విలాసవంతమైన కార్లు వీధుల్లో దర్శనమిస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థిని చూసిన ప్రేక్షకులు షాక్ అయ్యారు. వీడియో చూసిన నెటిజన్లు సైతం అవాక్కయ్యారు.

హెలికాప్టర్‌లో స్కూల్‌ఫెర్‌వెల్‌ పార్టీకి వచ్చిన విద్యార్థిని వీడియో ఇప్పుడు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వీడియో @videonation.teb అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేయబడింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!