AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Vijay: రూట్ మార్చిన సీఎం విజయ్.. బ్లాక్ కోట్ తీసేసి సరికొత్త స్టైల్‌లో దళపతి.. వీడియో వైరల్..

ఎప్పుడూ నల్లటి బ్లేజర్.. విదేశీ తరహా సూట్.. పక్కా స్టైలిష్ లుక్.. తమిళనాడు సీఎంగా విజయ్ రాజకీయాల్లోకి వచ్చాక మెయింటైన్ చేసిన ట్రేడ్‌మార్క్ స్టైల్ ఇది. కానీ ఒక్కసారిగా సీఎం విజయ్ రూట్ మార్చేశారు. తన ట్రేడ్‌మార్క్ బ్లాక్ కోటుని పక్కనపెట్టి.. ఊహించని సరికొత్త రూపంలో ఎంట్రీ ఇచ్చి అందరికీ మైండ్ బ్లాక్ చేశారు. అసలు విజయ్ అంతగా స్టైల్ మార్చడానికి కారణం ఏంటి? అనేది తెలుసుకుందాం..

CM Vijay: రూట్ మార్చిన సీఎం విజయ్.. బ్లాక్ కోట్ తీసేసి సరికొత్త స్టైల్‌లో దళపతి.. వీడియో వైరల్..
Tamil Nadu Cm Vijay Traditional Look
Ch Murali
| Edited By: |

Updated on: May 29, 2026 | 8:40 PM

Share

తమిళనాడు సీఎం విజయ్ ఒక్కసారిగా తన శైలిని మార్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి సరికొత్త పంథా అనుసరిస్తూ.. అధికారిక కార్యక్రమాల్లో ఎప్పుడూ విదేశీ తరహా నల్లటి కోటు ధరించే ఆయన, ఈసారి మాత్రం అందరి దృష్టిని ఆకర్షించేలా సరికొత్త రూపంలో దర్శనమిచ్చారు. తన మేనేజర్ జగదీష్ పళనిసామి కొత్త ఇంటి గృహప్రవేశ వేడుకకు హాజరయ్యారు. ఈ శుభకార్యానికి ఆయన ఎంతో నిరాడంబరంగా సాదాసీదాగా వెళ్లడం విశేషం. ప్రతిసారీ వెస్ట్రన్ లుక్‌లో కనిపించే సీఎం.. ఈసారి మాత్రం పక్కా సంప్రదాయ దుస్తులైన తెల్లటి చొక్కా, తెల్లటి పంచె ధరించి రావడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

హంగూ ఆర్భాటాలు లేకుండా..

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి వేడుకల్లో విజయ్ తన పాత శైలిని పక్కన పెట్టడం ఇదే మొదటిసారి. సొంత మేనేజర్ ఇంటి వేడుక కావడం వల్ల ఎలాంటి హంగూ ఆర్భాటాలు, ప్రొటోకాల్ హడావుడి లేకుండా ఒక సామాన్య వ్యక్తిలా వెళ్లినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఎంతో నిరాడంబరంగా మేనేజర్ ఇంటికి వెళ్లి.. అక్కడ చేరిన అతిథులు, కుటుంబ సభ్యులతో ఎంతో ఆత్మీయంగా ముచ్చటించి వారిలో ఉత్సాహం నింపారు.

రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

ముఖ్యమంత్రి విజయ్ తన కొత్త లుక్‌తో తమిళ సంస్కృతికి పెద్దపీట వేసినట్లు రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ నడుస్తోంది. సాధారణంగా పాశ్చాత్య దుస్తుల్లో కనిపించే నాయకుడు.. ఇలా ఒక్కసారిగా పక్కా లోకల్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించడం వల్ల ప్రజల్లోకి బలమైన సంకేతాలు వెళ్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ గృహప్రవేశ వేడుకకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యమంత్రి మారిన కొత్త రూపంపై ఆయన అభిమానులు, తమిళనాడు ప్రజలు ఫిదా అవుతూ.. సోషల్ మీడియాలో ఈ ఫోటోలను పెద్ద ఎత్తున పంచుకుంటున్నారు.

Follow Us